మోడీ గొంతు కోయడానికి బీహారీలు సిద్దంగా ఉన్నారు: రబ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

ఇక్కడున్న బీహారీల్లో చాలామంది నరేంద్ర మోడీ గొంతు కోయడానికి, ఆయన చేతులు నరకడానికి సిద్దంగా ఉన్నారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాట్నా: బీహార్ బీజేపీ చీఫ్ నిత్యానంద్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీని విమర్శించేవాళ్ల చేతులు విరగ్గొట్టాలి లేదా తెగనరకాలి అన్న ఆయన కామెంట్స్‌కు రబ్రీదేవి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు.

ఆర్జేడీ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను వరుసగా పదోసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న సందర్భంగా రబ్రీదేవి మాట్లాడారు.

'మోడీ వైపు వేలెత్తి చూపించేవాళ్ల వేళ్లు తెగనరకాలని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అంత పనిచేస్తే బీహారీలు మౌనంగా ఉంటారనుకున్నారా?.. ఇక్కడున్న బీహారీల్లో చాలామంది నరేంద్ర మోడీ గొంతు కోయడానికి, ఆయన చేతులు నరకడానికి సిద్దంగా ఉన్నారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Many in Bihar ready to slit PM's throat and chop his hand, says Rabri Devi

లాలూ కుటుంబం అవినీతి కేసులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీజేపీకి ఆర్జేడీకి మధ్య మాటల యుద్దం నడుస్తోంది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వి రైల్వే స్కామ్ ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారించడానికి సీబీఐ, ఎన్ ఫోర్స్ డైరెక్టరేట్ చాలాసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ రబ్రీదేవి ఇంతవరకు విచారణకు హాజరుకాలేదు.

తాను సీబీఐకి, ఈడీకి భయపడేది లేదని, విచారణ చేయాలనుకుంటే.. వారే తన ఇంటికి రావాలని తాను ఢిల్లీకి వెళ్లేది లేదని రబ్రీదేవి స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+