సిఎం పదవి: డిసెంబర్‌దాకా లాగేందుకు వారు పావులు?

పలువురు సీనియర్ నేతలు విధేయతనే ప్రధానంగా చూపించి పదవి చేజిక్కించుకునేందుకు లాబీయింగ్ వేగవంతం చేశారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమలో ఎవరికి పదవి ఇచ్చినా పరవాలేదని వీరు అధిష్ఠానం పెద్దలకు చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే, ఇరు ప్రాంత ప్రజా ప్రతినిధులు కోరుకుంటున్న నేతల్లో బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ ముందు వరుసలో ఉన్నారు. కాపు వర్గానికి చెందిన వీరిద్దరిలో ఎవరైనా సీమాంధ్రలో ప్రయోజనం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బొత్స పిసిసి అధ్యక్షుడు కావడం, కాంగ్రెస్ అధిష్ఠానానికి సన్నిహితుడు కావడం, తెలంగాణ నేతలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండడంతో ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
రెండు రోజుల ముందు నుంచే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బొత్స ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాను సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత మధ్యేమార్గంగా వ్యవహరించిన విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకు వెళ్తున్నారట. ఎన్నికల సమయంలోముఖ్యమంత్రి పదవి చేతిలో ఉంటే క్లిష్ట పరిస్థితుల్లోనూ సీమాంధ్రలో పార్టీ కేడర్‌ను ముందుకు నడిపేందుకు అనువుగా ఉంటుందని నచ్చ చెబుతున్నారట.
అంతేకాకుండా సీమాంధ్రలో తనకు అనుకూలంగా మల్చుకోవడానికి ఢిల్లీ పెద్దలను కలిసి ప్యాకేజీ గురించి అడుగుతున్నారట. మరోవైపు తెలంగాణ మంత్రులు జానా రెడ్డి, దామోదర రాజనర్సింహలు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే, కొత్త ముఖ్యమంత్రి విషయంలో మరి కొద్ది రోజుల వరకు ఏం తేల్చలేమని అధిష్టానం చెబుతోందట. సీమాంధ్రలోను, తెలంగాణలోను పార్టీ నిలదొక్కుకోవాలంటే సామాజికాంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని కొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications