రెచ్చిన మావోయిస్టులు: 10 మంది జవాన్ల మృతి

పాట్నా: బీహార్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. మావోయిస్టులు ఐఈడి పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన 10 మంది సిఆర్‌పిఎఫ్ కమోండోలు మరణించారు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో గల అటవీ ప్రాంతంలో జరిగింది.

నక్సల్స్ ఐఈడి పేల్చిన తర్వాత వారికి, సిఆర్‌పిఎఫ్ జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారు. పరిస్థితిని సమీక్షించడానికి సిఆర్‌పిఎఫ్ డిజి మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని సందర్శిస్తారు.

Maoist ambush leaves 8 CRPF jawans dead in Bihar’s Gaya

జిల్లాలోని ఇమామ్‌గంజ్ సరిహద్దుల్లో గల చంకర్బంద అటవీ ప్రాంతంలో ఆ ఘటన జరిగింది. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఎదురు కాల్పుల్లో కొంత మంది కోబ్రా బెటాలియన్ జవాన్లు తీవ్రంగా గాయపడడంతో మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.

మొబైల్ ఫోన్ కెనక్టివిటీ సజావుగా లేకపోవడంతో సంఘటనా స్థలం నుంచి సమాచారం సరిగా అందడం లేదు. నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్ కోసం 205వ కోబ్రా బెటాలియన్ జవాన్లను అక్కడ ప్రయోగించారు. కోబ్రాకు జరిగి అతి పెద్ద నష్టాల్లో ఇది ఒక్కటిగా భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+