మావోయిస్టుల సంచలన ప్రకటన.. ఆయుధాలు వదిలేస్తాం..!

మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు. ఆయుధాలు వదిలేస్తామని లేఖ రాశారు. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఎన్ కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. సీపీఐ మావోయిస్టు అధికారి అభయ్ పేరిట ఈ స్టేట్ మెంట్ రిలీజ్ అయింది. వరస ఎన్‌ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు రాలిపోతున్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 120 మందికి పైగా మావోయిస్టులు హతమయ్యారు. దీంతో మావోయిస్టులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే తక్షణమే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి, ఎన్ కౌంటర్లు ఆపితే ఆయుధాలు వదిలేస్తామని మావోయిస్టులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.

ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట అమిత్ షాకు లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. కాల్పులు వదిలేస్తామని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్‌ లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 2026 మార్చి వరకు మావోయిజాన్ని అంతం చేస్తామని గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే మహారాష్ట్ర ,జార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్‌ లో 120 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Maoist Ceasefire Buzz Social Media Erupts Over Rumored Amit Shah Letter Promising One-Month Arms Truce

మరోవైపు సీపీఐ (మావోయిస్టు) పార్టీ స్థాపనకు 21 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా వార్షికోత్సవాలను విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఆపరేషన్ కగార్ ను తిప్పికొట్టి, పార్టీ, పీఎల్‌ జీఏ (ప్రజా విముక్తి గెరిల్లా ఆర్మీ), ప్రజాసంఘాలను కాపాడుకోవాలని పేర్కొంది. ఈ క్రమంలో మావోయిస్టులు సంచలన ప్రకటన చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+