మావోయిస్టుల మందుపాతర: 7గురు జవాన్లు బలి
ముంబై: మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి ఆదివారం రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా పావిమురండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులో పోలీసుల వాహనాన్నే లక్ష్యంగా చేసుకుని పేల్చివేతకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
మావోయిస్టుల ఘాతుకంపై సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలింపు చర్యలో భాగంగా చమరోసి తాలూకాలోని పావిమురండ, ముర్మురి గ్రామాల మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఆదివారం ఉదయం 9 గంటల 40 నిమిషాల ప్రాంతంలో మందుపాతర పేల్చారు.

మృతి చెందిన జవాన్లు మహారాష్ట్ర ప్రత్యేక సి - 60 నక్స్ నిరోధ చర్యల బలగాలకు చెందినవారు. మందుపాతర పోలిన తర్వాత పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పులు చాలా సేపు జరిగాయి.
క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలియవచ్చింది. దాంతో వారికి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మావోయిస్టుల కోసం గడ్జిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.












Click it and Unblock the Notifications