GST collection: మార్చిలో జీఎస్టీ వసూళ్ల రికార్డులు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..!!
GST collection: దేశంలో GST వసూళ్లు మార్చిలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఈ క్రమంలో వస్తుసేవల పన్ను వసూళ్లు 13 శాతం మేర పెరిగి రూ.1.60 లక్షల కోట్లకు చేరుకున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
మార్చి మాసంలో CGST వసూళ్లు రూ.29,546 కోట్లుగా నమోదైంది. ఇదే సమయంలో SGST వసూళ్లు రూ.37,314 కోట్లుగా ఉన్నాయి. ఇక IGST రికార్డు స్థాయిలో రూ.82,907 కోట్లను వసూలు చేసింది. ఈ నెలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక IGST వసూళ్లు నమోదయ్యాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లను దాటడం ఇది నాలుగోసారి.

మార్చి నెలలో రిటర్న్‌ల దాఖలు రికార్డు స్థాయిలో పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల GST వసూళ్లు సంవత్సరానికి 22 శాతం పెరిగి మెుత్తంగా రూ.18.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దీనిని సగటున నెలవారీ ప్రాతిపధికన తీసుకున్నట్లయితే వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022-23లో స్థూల రాబడి గత సంవత్సరం కంటే 22 శాతం ఎక్కువ.
రాష్ట్రాల వారీగా జీఎస్టీ వసూళ్లను గమనించినట్లయితే జమ్మూ అండ్ కశ్మీర్ రాష్ట్రం ఈ మార్చి నెల వసూళ్లలో అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ 13.25 శాతం, ఆంధ్రప్రదేశ్ 11.3 శాతం మేర ఆదాయం పెరిగింది. ఇక ఆదాయ వృద్ధి విషయంలో హిమాచల్ ప్రదేశ్ 8.1 శాతం, గుజరాత్ 8.3 శాతంతో అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేశాయి.












Click it and Unblock the Notifications