Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూరి ఎఫెక్ట్: కాశ్మీర్‌పై పాకిస్తాన్‌కు కట్జు బంపర్ ఆఫర్

ముంబై/న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ పాకిస్తాన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పాక్ కావాలంటే కాశ్మీర్ మాత్రమే కాదని, దాంతో పాటు తప్పనిసరిగా బీహార్ కూడా తీసుకోవాలన్నారు. ఇదంతా ఓ ప్యాకేజీలా ఇస్తామని, అంతేతప్ప బీహార్ వద్దు, కాశ్మీర్ కావాలంటే కుదరదని చెప్పారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పేర్కొన్నారు.

పాక్‌కు మార్కండేయ ఖట్జూ ఆఫర్

పాక్‌కు మార్కండేయ ఖట్జూ ఆఫర్

మరో ట్వీట్‌లో కట్జూ.. ఇప్పుటే తనకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చిందని కాశ్మీర్ వదులుకుంటాం కానీ బీహార్ వద్ది చెప్పారని అన్నారు. కాశ్మీర్ కావాలని అడిగినందుకు వాళ్లు క్షమాపణ చెప్పారని, భవిష్యత్తులో అలా చేయబోమని హామీ ఇచ్చారన్నారు. బీహార్ కూడా తీసుకోవాలన్న ఆలోచన వాళ్లను భయపెట్టిందన్నారు. ఒకప్పుడు అలహాబాద్ వర్సిటీలో తమ ఇంగ్లీష్ అధ్యాపకుడు ఫిరాఖ్ గోరఖ్ పురి తనకు ఓ విషయం చెప్పారని, భారత్‌కు పాక్‌తో ముప్పు లేదని, బీహార్‌తో ఉందన్నారని చెప్పారు.

కట్జూ

కట్జూ

తాను చాలామంది గురించి జోకులు వేస్తుంటానని, పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్ అంటూ నేను చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాంటివేనని కట్జు ఆ తర్వాత పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్నానని, కాశ్మీర్‌తో పాటు బీహార్‌ను కూడా తీసుకోవాలని ఆయన చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఆయన పైన దేశద్రోహం కింద శిక్ష విధించాలని కొంతమంది డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కట్జు తాను చేసిన ట్వీట్‌ను సీరియస్‌గా తీసుకోవద్దని, ప్రజలకు సెన్సాఫ్ హ్యుమర్ పెరగాలన్నారు.

ఫవాద్ ఖాన్ రహస్యంగా పాక్ వెళ్లారు!

ఫవాద్ ఖాన్ రహస్యంగా పాక్ వెళ్లారు!

ఈ నేపథ్యంలో పాక్ నటుడు ఫవాద్ స్వదేశానికి వెళ్లిపోయాడని తెలుస్తోంది. యూరి ఉగ్రదాడి తరుణంలో పాక్‌ నటీనటులు భారత్‌ వదిలి వెళ్లిపోవాలని ఎంఎన్ఎస్ హెచ్చరించగా, నటీనటులకు భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ఫవాద్ ఖాన్

ఫవాద్ ఖాన్

కానీ ఫవాద్‌ ఖాన్‌ మాత్రం భారత్‌ను వదిలి స్వదేశానికి వెళ్లిపోయారని అంటున్నారు. ఆయన నటించిన 'యే దిల్‌ హైముష్కిల్' సినిమా రానుంది. ఈ తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఫవాద్‌ భార్య సదాఫ్‌ ఖాన్‌ గర్భవతి కావడంతో ఆమె కోసం పాక్‌కి వెళ్తాడని దర్శక నిర్మాత కరణ్‌ జోహర్‌ చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమంలో కూడా ఫవాద్‌ పాల్గొనడన్నారు. ఎంఎన్ఎస్ గొడవ సర్దుమణిగే వరకు ఫవాద్‌ని పాక్‌లోనే ఉండేలా కరణ్‌ అనుమతించినట్లుగా కూడా చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+