పెళ్లిలో బిగ్ షాక్.. కాబోయే వదిన కొంగులాగిన మరిది.. నెక్స్ట్ ఏం జరిగిందంటే ???
మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. అయితే ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో మాత్రం విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో వరుడి తమ్ముడు (మరిది) సరదాగా వధువు కొంగు లాగాడు. ఈ వ్యవహారం అనుకోని మలుపులు తిరిగి పెద్ద రచ్చగా మారింది.
అసలేం జరిగిందంటే..
వివాహ వేడుక జరుగుతున్న సమయంలో వరుడి తమ్ముడు (మరిది) సరదాగా వధువు కొంగు లాగాడు. చిన్న సరదాగా మొదలైన ఈ ఘటన కాస్తా ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. మరిది చేసిన అభ్యంతరకరమైన పనిని వధువు తరపు బంధువులు తప్పుబట్టారు. ఇరువర్గాల్లో కొందరు మద్యం మత్తులో ఉండటంతో మాట మాట పెరిగి రచ్చ రచ్చ అయింది. ఈ ఘర్షణలో పెళ్లి కొడుకు తలకు తీవ్ర గాయమవ్వగా, వధువు కజిన్ కూడా గాయపడ్డాడు.

కాగా పెళ్లి పీటల మీద లక్ష్మణ రేఖ దాటడంతో రాత్రికి రాత్రే పెళ్లి ఆచారాలు నిలిచిపోయాయి. దాంతో వివాదం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. మరుసటి రోజు ఉదయం గ్రామ పెద్దల సమక్షంలో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. గాయపడిన వారి చికిత్స ఖర్చుల కోసం రూ.4,500 ఇచ్చి రాజీ పడ్డారు.
ఇక స్టేషన్ లో గొడవ సర్దుమణిగి, ఇరు కుటుంబాల మధ్య అపార్థాలు తొలగిపోవడంతో వధువు శాంతించింది. అందరూ తిరిగి గ్రామానికి చేరుకున్నారు. ఆ సాయంత్రం మిగిలిన పెళ్లి ఆచారాలన్నీ పూర్తి చేసి, వధువును హ్యాపీగా అత్తారింటికి పంపించారు. మొత్తానికి సరదాగా మొదలైన ఈ ఘటన అనూహ్య మలుపులు తిరిగి పోలీస్ స్టేషన్ లో పంచాయతీ జరిగి సర్దుమనగడం సర్వత్రా చర్చకు తెరలేపింది.












Click it and Unblock the Notifications