CEC ని తొలగించాల్సిందే-ఇండీ కూటమి తీర్మానం..! డీఎంకే, ఆప్ ట్విస్టులు ..!
ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ (SIR)పై కేంద్ర ఎన్నికల సంఘంలో నెలకొన్న విభేదాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలు, వీటిపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం తర్వాత తప్పు అంగీకరిస్తున్నట్లుగా ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలపై ఇవాళ ఢిల్లీలో సమావేశమైన విపక్ష ఇండియా కూటమి (India Bloc) సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాల్సిందేనంటూ ఇండియా కూటమి ఓ తీర్మానం చేసింది. ఈ భేటీకి దూరంగా ఉన్న విపక్ష పార్టీలు డీఎంకే, ఆప్ కూడా ఈ డిమాండ్ కు మద్దతిచ్చాయి.
ఎస్ఐఆర్ ప్రక్రియలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్చించడంతో పాటు ఈసీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉమ్మడి ఆందోళన కోసం కీలకమైన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు ఇవాళ ఇండియా కూటమి పార్టీలు సమావేశమయ్యాయి. ఇందులో సీఈసీని తొలగించేందుకు లోక్‌సభ, రాజ్యసభలలో తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఒక ముసాయిదా నోటీసు సిద్ధం చేశారు. చర్చల సమయంలో వివిధ పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు చెప్పారు.

కాంగ్రెస్ ఛీఫ్ మల్లికార్జున్ ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, అలాగే టీఎంసీ నేతలు మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, ఎస్పీ, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) పార్టీల ప్రతినిధులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు.డీఎంకే, ఆప్ వేర్వేరు కారణాలను చూపుతూ ఈ భేటీకి దూరంగా ఉన్నాయి. అలాగే యూపీ రాజ్యసభ ఎన్నికల నామినేషన్లలో బిజీగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా రాలేదు. తన తరపున ప్రతినిధులను పంపారు. ఈ భేటీపై డీఎంకే నేత ఇళంగోవన్ స్పందిస్తూ.. తాము ఇండియా కూటమిలో లేమన్నారు. అయితే సీఈసీని తొలగించేందుకు పార్లమెంట్ లో జరిగే ప్రయత్నాలకు మద్దతిస్తామన్నారు.














Click it and Unblock the Notifications
