Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉ అంటావా మావా.. ఉహూ అంటావా.. శోభనం కోసం ఎన్నిసార్లు అడిగినా? చివరకు..?

పెళ్లి చేసుకుని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఓ యువతికి మొదటి రోజే చేదు అనుభవం ఎదురైంది. తన భర్త సామర్థ్యాన్ని దాచి పెళ్లి చేసుకున్నారంటూ.. అత్తమామలు తనను మోసం చేశారంటూ ఓ నవవధువు పోలీసులను ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌‌లో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. ఓ వైపు లక్షల రూపాయల ఖర్చు, మరోవైపు నమ్మకద్రోహం ఆ యువతి కుటుంబాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

అట్టహాసంగా పెళ్లి.. రూ.38 లక్షల ఖర్చు
కాన్పూర్‌లోని కిషోర్ నగర్‌కు చెందిన యువతికి, హమీర్‌పూర్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో 2025 ఏప్రిల్ 25న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. తన కూతురు కొత్త జీవితం సుఖంగా ఉండాలని భావించిన తండ్రి.. పెళ్లి కోసం సుమారు రూ. 38 లక్షలు వెచ్చించారు. హోటల్ ఖర్చులు, వెండి-బంగారు ఆభరణాలు, క్యాటరింగ్ ఇలా ప్రతి విషయంలోనూ భారీగా ఖర్చు చేశారు. అయితే పెళ్లయిన నాలుగు రోజులకే భర్త ప్రవర్తనలో మార్పు రావడం ఆమెకు దూరంగా ఉండటంతో నవవధువుకు అనుమానం మొదలైంది.

Marriage Fraud Case Husband Hides Impotency Kanpur Bride Files Case After Groom Refuses Wedding Night Intimacy

శోభనానికి నిరాకరణ.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అత్యంత ఆవేదనకరమైన విషయాలను వెల్లడించింది. పెళ్లయిన మొదటి రాత్రి నుంచే తన భర్త శారీరక సంబంధానికి దూరంగా ఉన్నాడని ఆమె పేర్కొంది. తాను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. శోభనం గురించి ప్రస్తావించినా అతను ఏదో ఒక వంకతో తప్పించుకునేవాడని వాపోయింది. చివరకు అతని శారీరక లోపం (నపుంసకత్వం) గురించి తనకు తెలిసిందని.. ఆ విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని ఆమె పోలీసుల ముందు వాపోయింది.

నోయిడాలోనూ అదే తీరు.. అత్తవారి బెదిరింపులు
కొద్దిరోజుల తర్వాత దంపతులు నోయిడాకు వెళ్లారు. అక్కడ సుమారు నెల రోజులు కలిసి ఉన్నా, భర్త ఆమెతో కనీస సాన్నిహిత్యం ప్రదర్శించలేదు. ఈ విషయంపై ఆమె తన మామగారిని నిలదీయగా.. "మా వాడికి చికిత్స చేయిస్తాం, నువ్వు కాపురానికి ఉండు" అని సర్దిచెప్పారు. కానీ రోజులు గడుస్తున్నా పరిస్థితి మారకపోగా.. అత్తవారి అసలు రంగు బయటపడింది. భర్తకు వైద్యం చేయించాలంటే పుట్టింటి నుంచి మరో రూ. 5 లక్షలు తీసుకురావాలని వేధించడం మొదలుపెట్టారు. దానికి నిరాకరించడంతో ఆమెను బెదిరించడమే కాకుండా, పరువు తీస్తామని హెచ్చరించారు.

పోలీసుల రంగప్రవేశం.. కేసు నమోదు
అత్తవారి వేధింపులు భరించలేక ఆ యువతి తిరిగి పుట్టింటికి చేరుకుని.. తన తండ్రితో కలిసి కాన్పూర్‌లోని రావత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భర్త, మామ, బాబాయ్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మోసంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడతామని, విచారణ నిమిత్తం ఒక బృందాన్ని హమీర్‌పూర్ పంపనున్నట్లు స్టేషన్ ఇన్ఛార్జ్ కమలేష్ రాయ్ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+