
Marriage: కారు, గుర్రం పక్కనపెట్టి బుల్డోజర్ లో పెళ్లికొడుకు ఊరేగింపు, ఇంజనీర్ తెలివి, వైరల్ !
భోపాల్/ బెతుల్: పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైనది కావడంతో ఎవరిస్థాయిని బట్టి వారి పెళ్లి చాలా గ్రాండ్ గా చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు. పెళ్లికొడుకు కారులో, గుర్రం మీద, బుల్లెట్, సైకిల్, ట్రాక్టర్ తదితర వాహనాల మీద కల్యాణమండపానికి వెళ్లిన విషయం మనం చాలానే చూశాము. అయితే ఇక్కడ ఓ పెళ్లికొడుకు వెరైటీగా బుల్డోజర్ మీద కల్యాణమంపడానికి వెళ్లి హాట్ టాపిక్ అయ్యాడు. ఇంజనీర్ అయిన పెళ్లికొడుకు బుల్డోజర్ మీద కల్యాణమండపానికి వెలుతున్న సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
High Court: ప్రియురాలు, ఆమె పిల్లల హత్య కేసులో ట్విస్ట్, హైకోర్టు సంచలన తీర్పు, ప్రియుడు నిర్దోషి!

సివిల్ ఇంజనీర్ పెళ్లి ఫిక్స్
మధ్యప్రదేశ్ లో బెతుల్ జిల్లాలోని జల్లార్ గ్రామంలో అంకుష్ జైశ్వాల్ అలియాస్ అంకుష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అంకుష్ సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అంకుష్ జైశ్వాల్ కు పెళ్లి ఫిక్స్ అయ్యింది. పెళ్లి కూతురు కూడా అందంగా ఉండటంతో అంకుష్ పెళ్లి చేసుకోవడానికి ఉరకలు వేశాడు. పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన పెద్దలు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

కారు, గుర్రం, బైక్ వద్దనుకున్నాడు
కల్యాణపండపానికి పెళ్లికూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బయలుదేరి వెళ్లారు. పెళ్లి కొడుకు అంకుష్ జైశ్వాల్ కూడా కల్యాణపండపానికి బయలుదేరడానికి సిద్దం అయ్యాడు. అయితే పెళ్లి కొడుకు కారులో, గుర్రం మీద కాకుండా అందంగా అలంకరించిన బుల్డోజర్ మీద కుర్చుకుని కల్యాణపండపానికి ఊరేగింపుగా బయలుదేరాడు.

వెరైటీగా బుల్డోజర్ లో కల్యాణమండపానికి
పెళ్లి కొడుకు అంకుష్ తో పాటు అతని బంధువులు అయిన ఇద్దరు మహిళలు, ఓ అబ్బాయి బుల్డోజర్ లో కుర్చుకుని కల్యాణపండపం చేరుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి కొడుకు అంకుష్ జైశ్వాల్ పెళ్లి దుస్తుల్లో బుల్డోజర్ మీద కుర్చుని ఊరేగింపుగా వెలుతున్న సమయంలో తీసిన ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి.

మనసులో మాట చెప్పిన పెళ్లి కొడుకు
ఈ సందర్బంగా పెళ్లి కొడుకు అంకుష్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ నేను సివిల్ ఇంజనీరింగ్ చదివానని, ప్రతిరోజు బుల్డోజర్లు, టిప్పర్ లారీలు, ట్రాక్టర్ల తదితర వాహనాలతో పనులు చేయిస్తుంటానని, నాకు పనికి ఉపయోగపడుతున్న బుల్డోజర్ లోనే కల్యాణపండపానికి వెళ్లాలని చాలాకాలం నుంచి అనుకుంటున్నానని, ఆ కోరిక తీరిపోయిందని చెప్పాడు.