Marriage: అక్క ఇంట్లో కొత్త పెళ్లికూతురు ఏం చేసిందంటే ?, దుబాయ్ భర్త, పెళ్లైన 2 వారాలకే, మాటవినలేదని !

బెంగళూరు/మంగళూరు: పెళ్లి అనేది ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం. బాగా చదువుకున్న యువకుడు విదేశాల్లో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. విదేశాల్లో లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న యువకుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఇంజనీరుతో ఆ యువతి పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వివాహం జరిగిన రెండు వారాలకే పెళ్లి కూతురు శవమై కనిపించడం కలకలం రేపింది. అసలు మ్యాటర్ తెలుసుకున్న పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు.

దుబాయ్ లో ఇంజనీరు

దుబాయ్ లో ఇంజనీరు

కర్ణాటకలోని మంగళూరు సిటీ సమీపంలోని అంబ్లమాగరు ప్రాంతంలో రశ్మీ విశ్వకర్మ అలియాస్ రశ్మీ (24) అనే యువతి నివాసం ఉంటున్నది. మంగళూరు సమీపంలోని గంజీమఠలో సందీప్ (33) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎంటెక్ చదువుకున్న సందీప్ దుబాయ్ లో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు.

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన రశ్మీ

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిన రశ్మీ


విదేశాల్లో లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న సందీప్ కు మా అమ్మాయి రశ్మీని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే సందీప్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని అప్పుడే రశ్మీ ఆమె కుటుంబ సభ్యులకు చెప్పిందని తెలిసింది.

పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది

పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది

రశ్మీ మాటలు ఏమాత్రం పట్టించుకోని ఆమె కుటుంబ సభ్యులు సందీప్ తో ఆమె పెళ్లి ఫిక్స్ చేశారు. దుబాయ్ ఇంజనీరు సందీప్ తో రశ్మీ పెళ్లి ఆగస్టు 21వ తేదీన మంగళూరులో చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లి సమయంలో తరువాత కూడా రశ్మీ ఆమె భర్త సందీప్ తో కలిసిపోయి సంతోషంగా ఉన్నట్లు అందరికి కనిపించింది.

అక్క ఇంట్లో కొత్త పెళ్లికూతురు ఏం చేసిందంటే ?

అక్క ఇంట్లో కొత్త పెళ్లికూతురు ఏం చేసిందంటే ?

ఈనెల 3వ తేదీన రశ్మీ, ఆమె భర్త సందీప్ తో కలిసి ఆమె సొంత అక్క ఇంటికి వెళ్లింది. కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు ఇంటికి వచ్చారని రశ్మీ కుటుంబ సభ్యులు వారికి ఇష్టం అయిన వంటలు చేసి వడ్డిస్తున్నారు. రెండు రోజుల నుంచి రశ్మీ ఆమె అక్క ఇంటిలోనే ఉంటున్నది. సోమవారం రాత్రి భోజనం చేసి రూమ్ లోకి వెళ్లిన రశ్మీ తరువాత ఎలుకల మందు తాగేసింది.

 ఇష్టం లేని పెళ్లి.... రెండు వారాలకే పెళ్లి ఇంట్లో ?

ఇష్టం లేని పెళ్లి.... రెండు వారాలకే పెళ్లి ఇంట్లో ?

ఎలుకల మందు తాగేసి అస్వస్థతకు గురైన రశ్మీని మంగళూరులోని ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై చనిపోయిందని పోలీసులు అన్నారు. సందీప్ ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని చెప్పినా రశ్మీ కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోకుండా పెళ్లి చేశారని, ఇదే విషయంలో పెళ్లి జరిగిన రెండు వారాలకే కొత్త పెళ్లి కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+