కత్తితో బెదిరించి స్నేహితుడి భార్యపై గ్యాంగ్‌రేప్ చేశారు

మీరట్: ఉత్తప్రప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో దారుణం చోటు చేసుకుంది. కత్తితో బెదిరింపులకు గురి చేసిన ఇద్దరు వ్యక్తులు వారి స్నేహితుడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేగాక ఆ అఘాయిత్యాన్ని వీడియో తీశారు. ఈ దారుణ ఘటన కంకర్ఖేడా ప్రాంతంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం.. తన నివాసంలో ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై ఆమె భర్త స్నేహితులు నదీమ్, ఆరీఫ్‌లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కత్తితో చంపుతామని బెదిరింపులకు గురిచేసిన దుండగులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటన అక్టోబర్ 10న జరిగింది.

Married woman gangraped by husband's friends in UP

కాగా, అత్యాచార ఘటనను వీడియో తీసిన నిందితులు, ఈ విషయాన్ని బయటపెడితే వీడియో దృశ్యాలను నెట్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరింపులకు గురి చేశారు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే ఆ తర్వాత కూడా వీడియోలను నెట్‌లో పెడతామని బెదరింపులకు దిగి మరోసారి అత్యాచార యత్నానికి యత్నించారు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని భర్తకు తెలిపింది.

బాధితు మహిళతో కలిసి భర్తు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నదీమ్, ఆరీఫ్‌లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, వారికి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నోయిడా: వేగంగా వచ్చిన ఓ డంపర్ ఢీకొనడంతో బైకుపై వెళుతున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నోయిడాలోని హోషియార్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మృతులను బులందషెహర్, సికందరాబాద్‌కు చెందిన సెహ్వాజ్(25), మోనూ(26)లుగా గుర్తించారు. ఇయర్ ఫోన్ పెట్టుకుని బైకు నడపడం వల్లే డంపర్ హారన్ సౌండ్ వినబడకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+