సిఎం ర్యాలీలో అమర జవాను కూతురిని లాగేశారు

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వివాదంలో చిక్కుకున్నారు. బిఎస్ఎఫ్ అమర జవాను కూతురును ముఖ్యమమంత్రి ర్యాలీ లాగేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వడొదరలోని కేవాడియా కాలనీలో ఈ సంఘటన జరిగింది.

ర్యాలీలో విజయ్ రూపానీ వైపు చొచ్చుకుని పోవడానికి ప్రయత్నించిన యువతిని లాగేసినట్లు చెబుున్నారు. ఆమెను రూపాల్ తాద్వి (26) అనే గిరిజన యువతిగా గుర్తించారు. ఆమె తండ్రి అశోక్ తాడ్వి అమరుడైన తర్వాత కుటుంబానికి భూమి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని రూపాని చాలా ఏళ్లుగా నిరసన వ్యక్తం చేస్తోంది. ఆ విషయం స్థానిక పోలీసులకు తెలుసు. శుక్రవారంనాడు రాపానీ ర్యాలీలో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా యువతి ఆయనవైపు దూసుకెళ్లడానికి ప్రయత్నించింది.

తాను ముఖ్యమంత్రిని కలుస్తానని అంటూ ఆమె దాదాపుగా రూపానిని సమీపించే సమయంలో మహిళా పోలీసులు లాగేశారు. సమావేశం తర్వాత కలుస్తానని రూపాని ఆమెకు చెప్పారు. కానీ అలా చేయలేదు. గతంలో కూడా ముఖ్యమంత్రి సెక్యురిటీ కవర్‌ను ఛేదించడానికి రూపాలి కుటుంబ సభ్యులు ప్రయత్నించారని పోలీసులు అంటున్నారు.

రూపాలీని పోలీసులు లాగి తీసుకుని వెళ్తున్న వీడియో ఇప్పుడు సందడి చేస్తోంది. ఆ వీడియోను కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. బిజెపి అహంకారం పతాక స్థాయికి చేరుకుందని వ్యాఖ్యానించారు. ఓ అమర జవాను బిడ్డును అలా లాగేయడం మానవత్వానికి మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The daughter of a 'martyred' BSF jawan was on Friday dragged away by woman police officials after she rushed towards Gujarat Chief Minister Vijay Rupani during a rally in Kevadia Colony in Vadodara.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి