ఆటోమొబైల్‌పై మాంద్యం ఎఫెక్ట్ : రెండురోజులు మారుతి కార్ల ఉత్పత్తి బంద్

హైదరాబాద్ : ఆటో మొబైల్ రంగంలో మాంద్యంతో మారుతి సుజుకీ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండురోజుల పాటు కంపెనీ స్పేర్ పార్ట్స్ తయారు చేయబోదని ప్రకటించింది. హర్యానాలోని గురుగ్రామ్, మానేసర్ ప్లాంటులలో ఈ నెల 7, 9 తేదీలను నో ప్రొడక్షన్ డేగా ప్రకటిస్తున్నామని పేర్కొన్నది. ఇటీవల ఆటోమొబైల్ రంగం భారీ మాంద్యం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆటో, కార్ల విక్రయాలు పడిపోవడంతో ఉత్పత్తి సంస్థలు పరిస్థితిని నిశీతంగా గమనిస్తున్నాయి.

ఈ నెల 7, 9వ తేదీల్లో హర్యానాలోని గురుగ్రామ్, మానేసర్ మారుతి ప్లాంటులలో కార్ల స్పేర్ పార్ట్స్ తయారు చేయబోమని ప్రకటించింది. కేవలం పరిస్థితిని నిశీతంగా గమనిస్తామని పేర్కొన్నది. ఆటో మొబైల్ రంగంపై మాంద్యం ఎఫెక్ట్ చూపడంతో గతనెలలో 33.9 శాతం మాత్రమే విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా ఏడో నెలలో కూడా ఆటో మొబైల్ రంగం కోలుకోలేదు.

Maruti Suzuki’s ‘no production’ at Gurugram, Manesar plants for two days amid auto crisis

గతేడాది ఆగస్టులో లక్ష 68 వేల 725 కార్లను ఉత్పత్తి చేస్తే .. ఈ సారి అది లక్ష 11 వేల 370కి పడిపోయిందని వివరించారు. ఇదీ ఆటోమొబైల్ విక్రయాల్లో 33.67 శాతామని వివరించారు. ఇక జూలైలో అదీ 25.15 శాతానికి పడిపోయింది. కేవలం లక్ష 33 వేల 625 విక్రయాలు మాత్రమే జరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+