వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైరల్ వీడియో.. ముఖానికి ముసుగులు,చేతిలో ఆయుధాలతో జేఎన్‌యూలో మూక హల్‌చల్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో జరిగిన హింసాకాండలో పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూకదాడికి పాల్పడినవారికి పోలీసులు సహకరించారని వామపక్ష విద్యార్థి సంఘాలు,పలువురు రాజకీయ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీ లోపల స్వేచ్చగా తిరుగుతున్న ముసుగు మూక వీడియోను కొంతమంది ట్విట్టర్‌లో షేర్ చేశారు.

చేతిలో ఆయుధాలు,ముఖాలకు ముసుగులతో క్యాంపస్‌లో వారు హల్‌చల్ చేస్తున్న దృశ్యాలు అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. శాంతియుత నిరసనలకు దిగితేనే అరెస్టులు చేసే పోలీసులు.. ఇలా ఆయుధాలతో వచ్చినవారిని ఎలా ఉపేక్షించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఘటన తర్వాత 10.45గం. సమయంలో దాడులకు పాల్పడ్డ మూక జేఎన్‌యూ గేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

masked attackers openly roaming inside jnu campus video gone viral on social media

అంతేకాదు,దాడిలో గాయపడ్డవారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు వచ్చిన అంబులెన్సుల టైర్లలో గాలి కూడా తీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. జేఎన్‌యూ గేట్ వద్ద పోలీసుల ఎదుటే ఇదంతా జరుగుతున్నా.. వారెందుకు పట్టించుకోలేదని విద్యార్థులు,రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. జరిగిన హింసాకాండకు బాధ్యత వహిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జరిగిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారణకు ఆదేశించారు.

Recommended Video

JNU Issue : ఏబీవీపీ v/s జేఎన్‌యూఎస్‌యూ || ABVP vs JNUSU || What Happened ? || Oneindia Telugu

జేఎన్‌యూ హింసాకాండపై ఏబీవీపి,వామపక్ష విద్యార్థి సంఘాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. దాడులకు పాల్పడింది ఏబీవీపీయే అని వామపక్ష విద్యార్థులు ఆరోపిస్తుండగా.. వామపక్ష విద్యార్థులే మొదట తమవారిపై దాడి చేశారని ఏబీవీపీ ఆరోపిస్తోంది. ఏదేమైనా ఆదివారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో మూడు గంటల పాటు తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. జరిగిన హింసాకాండలో దాదాపు 20 మంది గాయపడగా వారిని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జేఎన్‌యూలో దాడిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు అక్కడి విద్యార్థులకు మద్దతుగా నిలుస్తున్నాయి. జామియా యూనివర్సిటీ,అలీఘడ్ యూనివర్సిటీ,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నిరసనల ద్వారా ఈ దాడిని ఖండించాయి.

English summary
A video gone viral on social media that reflects masked attackers of JNU openly roaming inside university campus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X