వెయ్యి మంది మానవ బాంబులు సిద్ధం.. మసూద్ అజార్ ఆడియో లీక్!
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజార్ భారత్‌పై మరోసారి విషం చిమ్మాడు. వెయ్యి మందికి పైగా మానవ బాంబులు సిద్ధంగా ఉన్నారంటూ అతడు విడుదల చేసిన ఆడియో రికార్డింగ్ ఇప్పుడు కలకలం రేపుతోంది. వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఆత్మాహుతి దాడులకు తమ ముఠా సిద్ధంగా ఉందని.. తానే వారిని ఆపుతున్నానని పేర్కొన్న ఓ ఆడియో రికార్డింగ్ ఇప్పుడు బయటకు వచ్చింది.
ఆ ఆడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియోలో మసూద్ అజార్ గొంతును పోలిన వ్యక్తి ఇలా అన్నాడు. "భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న మానవ బాంబులు ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వందల సంఖ్యలో కూడా కాదు. కనీసం వెయ్యి మందికి పైగా నా అనుమతి కోసం వేచి చూస్తున్నారు. నేను గనుక అసలు సంఖ్యను బయటపెడితే రేపు ప్రపంచ మీడియాలో పెద్ద హంగామా జరుగుతుంది. వారు ప్రాణ త్యాగానికి సిద్ధంగా ఉన్నారు." అని ఆ ఆడియోలో మసూద్ అజార్ గొంతు పలికినట్లుగా ఉంది. అయితే ఈ ఆడియో ఎప్పుడు రికార్డ్ అయింది? దీని ప్రామాణికత ఎంత? అన్నది మాత్రం ఇంకా స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.

భారత్ దెబ్బకు బెంబేలెత్తిపోయి..
గత ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయంపై మెరుపు దాడులు (ఆపరేషన్ సిందూర్) నిర్వహించింది. ఈ దాడుల్లో మసూద్ అజార్‌కి అత్యంత సన్నిహితులు, బంధువులు హతమయ్యారు. ఈ పరాజయం నుంచి కోలుకోలేక, తమ ఉగ్రవాదుల్లో స్థైర్యం నింపేందుకే అజార్ ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్లు రక్షణ నిపుణులు భావిస్తున్నారు.
Jaish-e-Mohammad chief Masood Azhar claims that more than one thousand suicide bombers are ready and are pressuring him to allow them to infiltrate India.
— OSINT Spectator (@osint1117) January 11, 2026
pic.twitter.com/6YV3CWV2ue
మసూద్ అజార్ నేపథ్యం
2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై దాడుల వెనుక మాస్టర్‌మైండ్‌గా మసూద్ అజార్ ఉన్నాడు. 2019 తర్వాత అజార్ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. బహవల్పూర్‌లోని అతడి రహస్య స్థావరంపై గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడి చేసిన తర్వాత అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్లలో 15 మంది మరణించగా.. దీనికి సూత్రధారి అయిన ఉమర్ మొహమ్మద్‌కి జైషే మొహమ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు.
-
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications