Delhi: ఎగ్జిట్ పోల్స్.. మసాజ్, స్పా కంపెనీల నుంచా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకుని అధికారం చేపడుతుందని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయన కొట్టిపారేశారు.

అంతేగాక, సర్వేల ఎగ్జిట్ పోల్స్‌ను మసాజ్ పార్లర్లు, స్పా కంపెనీలతో పోలుస్తూ తీవ్రంగా స్పందించారు. మసాజ్, స్పా కంపెనీలు నిర్వహించే ఎగ్జి్ పోల్స్ నుంచి ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించగలమని సంజయ్ సింగ్ అన్నారు. ఫిబ్రవరి 8న వచ్చే అసలైన ఫలితాలు వరకూ వేచి చూడాలన్నారు. మరోసారి భారీ మెజార్టీతో ఆప్ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు.

Massage and spa companies AAP leader Sanjay Singh criticizes exit polls firms

ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై నమ్మకం ఉంచుతారని సంజయ్ సింగ్ చెప్పారు. విద్య విద్యుత్, నీరు, ఆరోగ్యం వంటి అంశాల్లో ఆప్ ప్రభుత్వం మెరుగైన సేవలను ప్రజలకు అందించిందని తెలిపారు. మహిళలకు రూ. 2100, వృద్ధులకు సంజీవని యోజన లాంటి హామీలు ఆప్ ప్రభుత్వం గెలిచేందుకు దోహదం చేస్తాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని తాము రుజువు చేస్తామన్నారు.

బుధవారం సాయంత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ పీఠం బీజేపీదేనని స్పష్టం చేశాయి. కొన్ని సర్వే సంస్థలు మాత్రం హోరాహోరీ పోరు జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ సింగ్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారిస్తూ వ్యాఖ్యలు చేశారు.

కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాసవాన్‌ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. కాగా, అసలైన ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+