కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో.. బుర్రాబజార్ ప్రాంతంలోని రీతురాజ్ హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 14 మంది దుర్మరణం చెందడం తీవ్ర విషాదం నింపుతోంది.
ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హోటల్లో అనుకోని రీతిలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఆ సమయంలో కస్టమర్స్, హోటల్ సిబ్బంది మంటల్లో చిక్కుకోగా.. రాత్రి సమయం కావడంతో.. గాలులు బలంగా వీచిన కారణంగా మంటలు మరింత త్వరగా వ్యాప్తి చెందినట్టు వెల్లడించారు. అంతే కాకుండా మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో హోటల్ సిబ్బంది ఒకరు పైకప్పు పై నుంచి దూకి మరణించినట్టు వివరించారు.

ఇక స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సుమారు 15 ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కొందరిని సురక్షితంగా కాపాడినప్పటికీ.. 14 మంది మంటల నుంచి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరోవైపు ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. ఇంకా హోటల్‌లో ఎవరైనా ఉన్నారా అనే దానిపై రెస్క్యూ కొనసాగుతోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత కోసం అధికారులు హోటల్ సిబ్బందిని, సాంకేతిక నిపుణులను ప్రశ్నిస్తున్నారు.
అయితే మృతుల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అగ్నిప్రమాదం ఘటనపై విచారణ కొనసాగుతోందని, దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
VIDEO | West Bengal: Visuals from outside a hotel located on Madan Mohan Barman Street in the Mechuapatti area of Kolkata where at least 14 people were killed and several others injured in a massive fire.
— Press Trust of India (@PTI_News) April 30, 2025
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/lCjmHIcIUx
ఈ దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్టు వాపోయారు. ప్రమాద స్థలాన్ని సీఎం సందర్శించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా కేంద్ర మంత్రి , సుకాంత మజుందార్ ఈ ఘటనపై స్పందిస్తూ బాధితులకు అత్యవసర వైద్య సేవలు అందించాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా కఠిన భద్రతా నిబంధనలు అమలులోకి తీసుకురావాలని సూచించారు.
#WATCH | Kolkata, West Bengal | A fire breaks out in a building near Falpatti Machhua. Fire tenders present at the spot. Efforts to douse the fire are underway. More details awaited. pic.twitter.com/pmCT6zeGVW
— ANI (@ANI) April 29, 2025












Click it and Unblock the Notifications