ఐఓసీ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం: ముగ్గురు మృతి, 44 మందికి గాయాలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రం హల్దియాలోని ఇండియన్ ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 44 మంది గాయాలపాలయ్యారు. గాయపడినవారిని కోల్‌కతాలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు హల్దియా మున్సిపాలిటీ ఛైర్మన్ ఇన్ కౌన్సిల్ ఎస్కే అజ్గర్ అలీ తెలిపారు.
హల్దియా రిఫైనరీ వివిధ ప్రధాన యూనిట్ల షట్‌డౌన్, నిర్వహణను చేపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మోటార్ స్పిరిట్ క్వాలిటీ (MSQ) యూనిట్‌లో మంటలు చెలరేగాయి. ప్రథమ చికిత్స కేంద్రంలో 47 మంది క్షతగాత్రులకు ప్రాథమిక ప్రథమ చికిత్స అనంతరం వారిని హల్దియా రిఫైనరీ ఆసుపత్రికి తరలించగా వారిలో ముగ్గురు మరణించారు. వీరిలో కనీసం ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గ్రీన్ కారిడార్ ద్వారా గాయపడిన వారిని కోల్‌కతాకు తరలింపు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా హల్దియాలోని ఇండియన్ ఆయిల్ రిఫైనరీలో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల ట్విట్టర్ వేదికగా 'తీవ్రమైన వేదన' వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారిని గ్రీన్ కారిడార్ ద్వారా కోల్‌కతాకు తీసుకువస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.
Deeply anguished by the fire in IOC, Haldia.
— Mamata Banerjee (@MamataOfficial) December 21, 2021
Three precious lives were lost and my thoughts are with the bereaved families in this hour of grief. Those injured are being brought to Kolkata through a green corridor. GoWB will extend all assistance to ensure their speedy recovery.
'ఒక్కసారిగా ఎగిసిన మంటల్లో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. దురదృష్టవశాత్తు ముగ్గురు వ్యక్తులు వారి తీవ్రగాయాలతో మరణించారు' అని ఓ పోలీసు అధికారి తెలిపారు. మంటలు ఆర్పివేయబడ్డాయని, పరిస్థితి అదుపులో ఉందని ఐఓసీ తెలిపింది. కాగా, అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారని కంపెనీ తెలిపింది.












Click it and Unblock the Notifications