• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారీ అగ్ని ప్రమాదం: సురక్షితంగా బయటపడ్డ అమితాబ్ (ఫోటోలు)

By Nageswara Rao
|

ముంబై: ‘మేక్‌ ఇన్‌ ఇండియా వీక్‌' పేరుతో ముంబైలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు, సహాయకబృందాలు వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెనుప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

మొత్తంగా చూస్తే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ముంబైలోని నదీతీరంలో ఉన్న గిర్‌గౌమ్ చౌపాటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే, అమితాబ్‌బచ్చన్‌, అమీర్‌ఖాన్‌ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ తారలు హాజరయ్యారు.

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఓ నృత్య కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగి పెను మంటలు వ్యాపించడంతో వేదిక పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే అమితాబ్ వేదిక దిగారు. అనంతరం రాత్రి గం.8.22ల సమయంలో ‘మహారాష్ట్ర రజనీ' నృత్య ప్రదర్శన కొనసాగుతున్నపుడు వేదిక కింద నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రమాద సమయంలో దాదాపు 500మంది కళాకారులు వేదిక వెనుక భాగంలోనే ఉన్నారు. గాలి కూడా తీవ్రంగా ఉండటం వల్ల మంటలు పూర్తిగా వ్యాపించాయని, మొత్తం వేదిక తగులబడి పోయిందని అధికార వర్గాలు తెలిపాయి. తక్షణమే భారీ ఎత్తున అగ్ని మాపక దళాలను రంగంలోకి దింపడం వల్ల మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయని, ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరుగలేదని వెల్లడించాయి.

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

అగ్ని ప్రమాదం ఒక్కసారిగా పెనుమంటలకు దారితీయడంతో హుటాహుటిన పధ్నాలుగు అగ్నిమాపక దళాలను, పదికిపైగా వాటర్ ట్యాంకులను తెప్పించిన వివరించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రముఖులను తరలించినప్పటికీ ముఖ్యమంత్రి ఫద్నవీస్ అక్కడే ఉండి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు.

 మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

ప్రమాద కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ‘అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు'అని తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పటికీ..అసలు కారణం ఏమిటన్నది తెలియలేదు. చెక్కలతో నిర్మించిన వేదిక అడుగు భాగం నుంచే మంటలు మొదలయ్యాయని చెబుతున్నారు.

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

భారత దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించేందుకు మేక్ ఇన్ ఇండియా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

మేకిన్ ఇండియా వీక్‌లో భారీ అగ్ని ప్రమాదం

వేదిక ప్రాంగణంలో సినీ ప్రముఖులు వివేక్‌ ఒబెరాయ్‌, ఇషా కొప్పికర్‌, శ్రేయాస్‌ తల్పడే, ప్రసూన్‌ జోషిలతోపాటు పలువురు వీవీఐపీలు, 500 మంది కళాకారులు, యాభైవేలమంది ప్రేక్షకులు ఉన్నారు. ముఖ్యమంత్రి ఫడణవీస్‌ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆ తర్వాత బాలీవుడ్‌ ప్రముఖులు ప్రదర్శించాల్సి ఉన్న కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. ప్రధాని మోదీ ఫడణవీస్‌కు ఫోన్‌ చేసి ప్రమాద సంఘటనపై ఆరా తీశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A massive fire broke out on Stage during a cultural event 'Maharashtra Night' at the Make In India week in Mumbai on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more