సీఎంగా యోగి ఆదిత్యనాథ్ మరో 'అతిపెద్ద' సంస్కరణ, రాత్రికి రాత్రే..

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాత్రికి రాత్రే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలన, భద్రతా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసే ఫైల్ పైన సంతకం చేశారు.

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాత్రికి రాత్రే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాలన, భద్రతా వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసే ఫైల్ పైన సంతకం చేశారు.

138 మంది బదలీ

138 మంది బదలీ

ఏకంగా 138 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. వీరిలో 84 మంది ఐఏఎస్, 54 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. బదలీ అయిన వారిలో ఏకంగా 38 మంది జిల్లా కలెక్టర్లు, 33 మంది ఎస్పీలు ఉన్నారు.

ప్రియదర్శిని కూడా ట్రాన్స్‌ఫర్

ప్రియదర్శిని కూడా ట్రాన్స్‌ఫర్

లక్నో కలెక్టర్ ప్రియదర్శిని కూడా ట్రాన్స్‌ఫర్ కావడం సంచలనం రేకెత్తిస్తోంది. ఆమె స్థానంలోకి కౌశల్ రాజ్ శర్మను తీసుకొచ్చారు. బదిలీ అయిన వారిలో బరేలీ, కాన్పూర్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్ కలెక్టర్లు కూడా ఉన్నారు.

రాయ్‌బరేలీ డీఎం కూడా..

రాయ్‌బరేలీ డీఎం కూడా..

రాయ్‌బరేలీ డీఎం సురేంద్ర సింగ్‌ను కాన్పూర్ డీఎంగా పంపించారు. అగ్రికల్చరల్ స్పెషల్ సెక్రటరీ పింకి జోవల్‌ను రాయబరేలీ డీఎంగా పంపించారు.

ఐపీఎస్‌లు..

ఐపీఎస్‌లు..

ఐపీఎస్ అధికారుల విషయానికి వస్తే ఘజియాబాద్, లక్నో, షహరాన్ పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, ఘాజీపూర్, గోరఖ్ పూర్ ఎస్పీలు బదిలీ అయిన వారిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇదే అతి పెద్ద సంస్కరణగా చెబుతున్నారు.

Read in Hindi:
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+