జమ్మూ కశ్మీర్‌లో ప్రధాని ఎన్నికల ప్రచారం..భారీగా పట్టుబడ్డ ఆయుధాలు
అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కుప్వారాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు చెందిన రెండు రహస్య స్థావరాలను గుర్తించారు. ఆ ప్రాంతం నుంచి 100కు పైగా ఏకే 47 తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు, ఐఈడీ బాంబులు, పేలుడుకు సంబంధించిన ఇతర మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికలకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది.
అంతేగాక ఎన్నికల ప్రచారం నిమిత్తం మోడీ ఈ నెల 14న కశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందే పేలుడు పదార్థాలు లభ్యం కావడంతో అధికారులు ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. మరోవైపు బుధవారం కథువా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.జమ్మూ కాశ్మీర్‌కు మూడు దశల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25 మరియు అక్టోబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి.

ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలి ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో అధిక ఓటింగ్ శాతం నమోదైంది.ఆర్టికల్ 370ని 2019 రద్దు చేసిన తర్వాత జమ్మూ మరియు కాశ్మీర్ రాజకీయ దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు పాలనను నిర్వచించనున్నాయి. కాశ్మీర్ జనాభాలో ముస్లింలు 96 శాతానికి పైగా ఉన్నారు.భారతీయ జనతా పార్టీ 2014లో 60 శాతం కంటే ఎక్కువ ఓటింగ్‌తో 25 సీట్లు గెలుచుకుంది. ప్రత్యేక హోదా రద్దు తర్వాత జరగనున్న ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు పాలనలో శాశ్వత మార్పును చూపుతుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మరి కాశ్మీర్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాలి.












Click it and Unblock the Notifications