గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, ఆంధ్రా, కర్ణాటక పట్టించుకోలేదు, గనుల వ్యాపారి!
బెంగళూరు: మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందని గునుల వ్యాపారి, జేడీఎస్ పార్టీ నాయకుడు టపాల్ గణేష్ ఆరోపించారు. గాలి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని టపాల్ గణేష్ అన్నారు. ఆంధ్రా, కర్ణాటక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని టపాల్ గణేష్ మండిపడ్డారు.

ఆంధ్రా, కర్ణాటక నిర్లక్షం
సరిహద్దు ప్రాంతాలు గుర్తించి వాటికి పరిష్కారం చూపడంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిర్లక్షం చేస్తున్నాయని, సుప్రీం కోర్టు ఆదేశాలు పట్టించుకోలేదని గనుల వ్యాపారి టపాల్ గణేష్ గురువారం బళ్లారిలో ఆరోపించారు.

గాలి, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
కర్ణాటక మాజీ మంత్రి, అక్రమ గనుల కేసులో జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర్, విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ తదితరులతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డారని జేడీఎస్ పార్టీ నాయకుడు టపాల్ గణేష్ ఆరోపించారు.

సీఎం ఎందుకు మౌనం
ఐదు సంవత్సరాల క్రితం సిద్దరామయ్య అధికారంలోకి రాకముందు బెంగళూరు నుంచి బళ్లారి వరకూ పాదయాత్ర చేసి గాలి జనార్దన్ రెడ్డి కారణంగా బళ్లారి జిల్లాలో వేల కోట్ల రూపాయల గనుల సంపద లూటీ అయ్యిందని ఆరోపించారని టపాల్ గణేష్ గుర్తు చేశారు.

అధికార దాహం
2013 మే 5వ తేదీ జరిగిన శాసన సభ ఎన్నికల్లో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని టపాల్ గణేష్ గుర్తు చేశారు. సిద్దరామయ్య సీఎం అయిన తరువాత గాలి జనార్దన్ రెడ్డి మీద ఆరోపణలు చెయ్యడం తగ్గించారని, అందరూ ఒక్కటైపోయారని టపాల్ గణేష్ ఆరోపించారు.

పెళ్లికి వెళ్లారు
బెంగళూరులో గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహ అప్పటి హోం శాఖ మంత్రిగా ఉన్నా డాక్టర్ జీ. పరమేశ్వర్ హాజరైనారని టపాల్ గణేష్ అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరౌతున్నారని జేడీఎస్ పార్టీ నాయకుడు టపాల్ గణేష్ ఆరోపించారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications