భర్త ఉద్యోగానికి వెళ్లాడు, కుమార్తెను హత్య చేసి తల్లి ఆత్మహత్య !

జీవితంపై విరక్తి చెందిన మహిళ కుమార్తెకు ఉరి వేసి హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని కేజీ నగర సమీపంలోని దత్తాత్రేయ నగరలో నివాసం ఉంటున్న మంగళ (28) అనే మహిళ

బెంగళూరు: జీవితంపై విరక్తి చెందిన మహిళ కుమార్తెకు ఉరి వేసి హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. బెంగళూరులోని కేజీ నగర సమీపంలోని దత్తాత్రేయ నగరలో నివాసం ఉంటున్న మంగళ (28) అనే మహిళ కుమార్తె సన్నిధి (5) ని హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది.

సందీప్ అనే వ్యక్తితో ఎనిమిది ఏళ్ల క్రితం మంగళ వివాహం జరిగింది. వీరి కుమార్తె సన్నిధి (5)ని ఇటీవలే ఓ స్కూల్ చేర్పించారు. సందీప్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం సందీప్ ఉద్యోగానికి వెళ్లాడు.

Mather and daughter hanging in Bengaluru City

సాయంత్రం మంగళ బెడ్ రూంలో కుమార్తె సన్నిధికి ఉరి వేసి హత్య చేసింది. అనంతరం అదే రూంలో ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి ఇంటికి వచ్చిన సందీప్ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాల కారణంగా మంగళ కుమార్తె సన్నిధిని హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+