వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎనిమిదేళ్లలో కేవలం 5సార్లే: మాయావతి గురించి షాకింగ్

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభకు రాజీనామా చేయడం వెనుక అసలు విషయం వెలుగు చూసింది!

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బిఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభకు రాజీనామా చేయడం వెనుక అసలు విషయం వెలుగు చూసింది!

యూపీలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేశారనే వాదనలు వినిపించాయి. అయితే, అంతుకుమించిన ఆసక్తికర కోణాలు పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్‌లో వెల్లడయ్యాయి.

దళితుల సమస్యలపై రాజ్యసభలో తనకు మాట్లాడే అవకాశమివ్వ లేదని అందుకే తాను రాజీనామా చేస్తున్నానని మాయావతి చెప్పారు. కానీ రాజకీయ వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తేలింది.

Mayawati raised Dalit issue in Rajya Sabha 5 times in 8 yrs

దళిత నేతను కాబట్టే తన గొంతు నొక్కుతున్నారంటూ రాజ్యసభకు రాజీనామా చేశానని చెప్పినప్పటికీ అదంతా వట్టిదేనని తెలుస్తోంది.

కేవలం ఐదుసార్లే మాట్లాడారు

పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ ఈ మేరకు పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి తెచ్చింది. 2009 జూన్ 1 నుంచి 2017 ఏప్రిల్ 12 వరకు మాయావతి ఎనిమిదేళ్లుగా మొత్తం 80 పార్లమెంటు చర్చల్లో పాల్గొన్నారు. కానీ రాజ్యసభలో కేవలం ఐదు సార్లు మాత్రమే దళితుల సమస్యలపై ఆమె గొంతు విప్పారు.

కనీసం అలా బిల్లు పెట్టలేదు

మాయావతి గత మూడు దఫాలుగా రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ఏ స్టాండింగ్ కమిటీలోనూ ఆమె సభ్యురాలుగా లేరు. ఈ కాలంలో కనీసం ప్రయివేటు మెంబర్ బిల్లు ప్రవేశం పెట్టడం గానీ, కనీసం ప్రశ్నించడం గానీ చేయలేదు.

మళ్లీ రాజ్యసభలో అడుగు పెట్టే ఎమ్మెల్యేల బలం లేదు

మరోవైపు వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి రాజ్యసభలో మాయావతి పదవీకాలం ముగియనుంది. మరో ఎనిమిది నెలలు మాత్రమే ఉంది. యూపీ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆమెకు.. మరో దఫా రాజ్యసభలో అడుగుపెట్టేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఇప్పుడు లేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 403 అసెంబ్లీ స్థానాల కోసం జరిగిన ఎన్నికల్లో బిజెపి 300కు పైగా సీట్లు గెలుచుకుంటే, మాయావతి పార్టీ బిఎస్పీ కేవలం 18 స్థానాలకు పరిమితం అయింది.

ఇన్నాళ్లు రాజ్యసభలో కేవలం ఐదుసార్లు మాత్రమే దళితుల కోసం మాట్లాడిన మాయావతి.. ఇప్పుడు మళ్లీ దళితులకు చేరువయ్యేందుకు ఒక్కసారిగా రాజీనామా పేరిట వ్యూహం రచించారని అంటున్నారు.

రాజీనామాలోను మెలిక?

ప్రస్తుతం ఆమె రాజీనామా రాజ్యసభ చైర్మన్ వద్ద పెండింగ్‌లో ఉంది. నిబంధనల ప్రకారం రాజీనామా లేఖ సంక్షిప్తంగా ఉండాలి. కారణాలను ప్రస్తావించకూడదు. అయితే మాయావతి రాజీనామా లేఖ మాత్రం మూడు పేజీల మేర ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అసలు చైర్మన్ ఆమె రాజీనామా అంగీకరిస్తారో లేదో కూడా ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.

English summary
Bahujan Samaj Party (BSP) supremo Mayawati resigned as a Rajya Sabha MP on Tuesday, blaming the Chair for not allowing her to speak about the atrocities against Dalits. According to the PRS Legislative Research, she has raised the Dalit issue in the House in five debates out of 80 she participated in, since June 1, 2009 to April 12, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X