బీజేపీ మొహాల్లోనే ఆ విషయం కనిపిస్తోంది: మాయావతి
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు మొహాల్లో నవ్వులు కనిపిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి బుధవారం అన్నారు.
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ నేతలు మొహాల్లో నవ్వులు కనిపిస్తున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, మాజీ సీఎం మాయావతి బుధవారం అన్నారు.
వాళ్లు నిజాయతీగా గెలవలేదన్నారు. ఆ విషాయాన్ని వారి ముఖాలే చెప్తున్నాయన్నారు. బీజేపీ దగా, మోసం చేసి విజయం సాధించిందన్నారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు.

ఈవీఎంల మోసంపై కోర్టును ఆశ్రయిస్తామని, ఈవీఎంల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారన్నారు. ఈ అంశంపై నిరసన తెలియజేస్తామన్నారు. యూపీ ఎన్నికల్లో బీజేపీ 325 స్థానాల్లో సంచలన విజయాన్ని సాధించగా, బీఎస్పీ మాత్రం 19 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితమైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications