కాంగ్రెస్‌కు మాయావతి షాక్: రాజస్తాన్ మధ్యప్రదేశ్‌లో ఒంటరిగానే పోటీ
Recommended Video

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని చెప్పి షాక్ ఇచ్చిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతి... మధ్యప్రదేశ్ రాజస్థాన్‌లలో కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రెండు రాష్ట్రాల్లో కూడా ఒంటరిగానే పోటీచేయాలని బీఎస్పీ భావిస్తున్నట్లు ఆపార్టీ అంతర్గత వర్గాలు చెప్పాయి. శుక్రవారమే మాయావతి మూడు రాష్ట్రాలకు సంబంధిచి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో తాము పోటీచేయబోయే 40 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని బీఎస్పీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామాచల్ రాజ్‌బార్ చెప్పారు. ఇప్పటికే 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించామని చెప్పిన రామాచల్ మిగతా 168 స్థానాలకు కూడా అభ్యర్థుల పేర్లను అక్టోబర్ మొదటివారంలో ప్రకటిస్తామని తెలిపారు. సొంతంగానే పోటీచేస్తామని చెబుతూ ఇప్పటికే అభ్యర్థుల్లో పార్టీలో భరోసా నింపుతోంది మాయావతి. అక్టోబర్‌లోనే మధ్యప్రదేశ్‌లో మాయావతి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని రామాచల్ చెప్పారు.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ కొన్ని సీట్లు మాత్రమే బీఎస్పీకి ఆఫర్ చేస్తోందని మరో సీనియర్ బీఎస్పీ నాయకుడు చెప్పారు. ఇదిలా ఉంటే బీఎస్పీ నుంచి బహిష్కరించబడ్డ దళిత నేత దేవాశిష్ జరారియాకు కాంగ్రెస్ స్వాగతం పలికింది. రాజస్తాన్‌లో కూడా ఒంటరిగానే బీఎస్పీ పోటీచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజస్తాన్ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు విషయంలో బీఎస్పీ కాంగ్రెస్ మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడంతో కలిసి పోటీ చేసే ఆలోచనను మాయావతి విరమించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.












Click it and Unblock the Notifications