Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

MBA Student: మైసూరు గ్యాంగ్ రేప్, తమిళనాడులో నలుగురు అరెస్టు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ !

బెంగళూరు/ మైసూరు/ చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూరులోని ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు చామరాజనగర మీదుగా తమిళనాడు, కేరళ పారిపోయారని పోలీసులు గుర్తించారు. సుమారు 80 మందికి పైగా పోలీసులు ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసు విచారణ చేస్తున్నారు. కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్ లు తమిళనాడు వెళ్లి రహస్య ప్రాంతంలో తలదాచుకున్న నలుగురు కామాంధులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మైసూరు పిలుచుకుని వచ్చి రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారని తెలిసింది. శనివారం సాయంత్రం పోలీసు అధికారులు అధికారికంగా నిందితులను అరెస్టు చేశామని ప్రకటించే అవకాశం ఉంది. గ్యాంగ్ రేప్ జరిగిన 85 గంటల తరువాత నలుగురు నిందితులు పోలీసులకు చిక్కిపోయారు.

 రింగ్ రోడ్డు నుంచి ఫాలో అయిన కామాంధులు

రింగ్ రోడ్డు నుంచి ఫాలో అయిన కామాంధులు

ప్రపంచ ప్రసిద్ది చెందిన రాచనగరి మైసూరు సమీపంలోని ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం చాముండి కొండ సమీపంలో దారుణంగా జరిగింది. మైసూరులోని ఓ ప్రముఖ కాలేజ్ లో ఏంబీఏ చదువుకుంటున్న యువతి, ఆమె స్నేహితుడు మంగళవారం సాయంత్రం బైక్ లో చాముండికొండ మీదకు వెళ్లి అక్కడి పుణ్యక్షేత్రంలో అమ్మవారిని దర్శించుకున్నారు. కాలేజ్ అమ్మాయి, ఆమె బాయ్ ఫ్రెండ్ బైక్ లో వెలుతున్న సమయంలో కామాంధులు వారిని మైసూరు రింగ్ రోడ్డు నుంచి ఫాలో అయ్యారని సమాచారం.

 ఒక్కసారిగా దాడి

ఒక్కసారిగా దాడి

అమ్మవారి దర్శనం చేసుకున్న తరువాత బైక్ లో కొండ దిగుతున్న సమయంలో కాలేజ్ విద్యార్థిని, ఆమె స్నేహితుడు మార్గం మద్యలో చాముండితప్ప సమీపంలోని లలితాద్రిపురంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో వెళ్లిన ఆరు మంది కామాంధులు కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద దాడి చెయ్యడంతోవారు హడలిపోయారు. తరువాత అమ్మాయి మీద కామాంధులు గ్యాంగ్ రేప్ చేశారు.

 కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ?

కాలేజ్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే ?

ఇప్పటికే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అనే విసయం పోలీసులకు చెప్పాడు. తన మీద దాడి చేసిన తరువాత ఇద్దరినీ లలితాద్రిపురంలోని నిర్జనప్రదేశంలోకి లాక్కొని వెళ్లారని చెప్పాడు. తన మీద బండరాయితో దాడి చేసి చితకబాదేశారని, తాను స్పృహ తప్పి పడిపోయారని, తరువాత తనస్నేహితురాలిని నిర్జనప్రదేశంలోని లాక్కొని వెళ్లారని పోలీసులకు చెప్పాడు.

 స్పృహలోకి వస్తే ఇది జరిగింది

స్పృహలోకి వస్తే ఇది జరిగింది

రాత్రి పూట జనసంచారం తక్కువగా ఉండటంతో కామంధులు రెచ్చిపోయారు. కాలేజ్ అమ్మాయి మీద ఒకరి తరువాత ఒకరు ఆరు మంది సామూహిక అత్యాచారం చేసి రాక్షసుల్లా వారి కామం తీర్చుకున్నారు. స్పృహలోకి వచ్చిన సమయంలో తన పక్కన ఇద్దరు నిలబడి ఉన్నారని, మిగిలిన వాళ్లు ఆ అమ్మాయిని పొదల్లో నుంచి బయటకు తీసుకు వచ్చారని బాధితురాలి స్నేహితుడు పోలీసులకు చెప్పాడు.

 దర్జాగా వెళ్లిపోయారు

దర్జాగా వెళ్లిపోయారు

తన స్నేహితురాలి మీద గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు ఆ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసినా, బయట ఎవరికైనా చెప్పినా మిమ్మల్ని ఇద్దర్నీ చంపేస్తామని బెదిరించి వార్నింగ్ ఇచ్చారని, మాకు ఎదరు తిరిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారని బాధితురాలి స్నేహితుడు పోలీసులకు చెప్పాడు.

 పోలీసుల భయంతో తమిళనాడు, కేరళ పరార్

పోలీసుల భయంతో తమిళనాడు, కేరళ పరార్

మైసూరు గ్యాంగ్ రేప్ కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపడంతో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో నిందితులు మైసూరు నుంచి చామరాజనగర, తరువాత అక్కడి నుంచి తమిళనాడు, కేరళ పారియిఉంటారని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. నిందితులను అరెస్టు చెయ్యడానికి పోలీసులు మూడు రోజుల నుంచి అనేక ప్రయత్నాలు చేశారు.

 ప్రభుత్వానికి కంటి మీద కునుకులేదు

ప్రభుత్వానికి కంటి మీద కునుకులేదు

మైసూరు ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసు కర్ణాటక ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. మైసూరు గ్యాంగ్ రేప్ విషయంలో కర్ణాటక హోమ్ మంత్రి అరగ జ్ఞానేంద్ర, మరో ఇద్దరు మంత్రులు, బీజేపీ ఎంపీ సిద్దలింగేశ్వర తదితరులు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో విమర్శలపాలైనారు.

Recommended Video

    ఇద్దరు డ్యాన్సర్లు,విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు
     85 గంటల తరువాత అరెస్టు

    85 గంటల తరువాత అరెస్టు

    మైసూరులోని ఎంబీఏ విద్యార్థిని మీద ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారని బాధితురాలు చెప్పిందని పోలీసులు అంటున్నారు. కాలేజ్ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు తమిళనాడు, కేరళ పారిపోయారు. గ్యాంగ్ రేప్ జరిగిన 85 గంటల తరువాత నలుగురు కామాంధులు తమిళనాడులో కర్ణాటక పోలీసులకు చిక్కారు, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు అయిన నలుగురు కామాంధులు ఇంజనీరింగ్ విద్యార్థులని పోలీసుల విచారణలో తెలిసిందని సమాచారం. అయితే అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసింది ఇంజనీరింగ్ విద్యార్థులా ?, కాదా అనే విషయం పోలీసులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి. ఎంబీఏ కాలేజ్ అమ్మాయి గ్యాంగ్ రేప్ కు గురైన ప్రాంతంలో మొదట పోలీసులు పరిశీలించారు. గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు అక్కడ కొన్ని బీర్ బాటిల్స్, బస్సు టిక్కెట్ లు వదిలేసిన వెళ్లిపోయిన విషయం గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. బీర్ బాటిల్స్ చేతిలో పట్టుకున్న పోలీసులు మైసూరు నగరంలో, సిటీ పరిసర ప్రాంతాల్లోని అన్ని బార్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో అవి ఎక్కడ తీసుకున్నారు అని పూర్తిగా బయటకు లాగారు. గ్యాగ్ రేప్ జరిగిన స్పాట్ లో చిక్కిన బీర్ బాటిల్స్, బస్ టిక్కెట్ల ఆధారంగా నిందితులను తమిళనాడులో పోలీసులు పట్టుకున్నారని సమాచారం. గ్యాంగ్ రేప్ లో కేసులో అరెస్టు అయిన నలుగురు నిందితులతో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది. ఇప్పుడు తప్పించుకున్న మరో నిందితుడి కోసం తమిళనాడు, కేరళలో వేట మొదలైయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+