ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య
న్యూఢిల్లీ: జీవితంపై విరక్తి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకునింది. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో విద్యాభ్యాసం చేస్తున్న ఖుష్బూ చౌదరి (19) ఆత్మహత్య చేసుకునిందని సోమవారం పోలీసులు అన్నారు.
రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతానికి చెందిన ఖుష్బూ చౌదరి జులై 10వ తేదిన ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరింది. ఎయిమ్స్ లోని హాస్టల్ లో నివాసం ఉంటున్నది. ఆదివారం ఖుష్బూ చౌదరి ఉరి వేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఖుష్బూ మరణించిందని వైద్యులు దృవీకరించారని పోలీసు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి ఖుష్బూ స్నేహితులతో కలిసి షాపింగ్ చేసిందని వెలుగు చూసింది.
ర్యాగింగ్ కారణంగా ఖుష్బూ ఆత్మహత్య చేసుకోలేదని ఎయిమ్స్ అధికార ప్రతినిధి అమిత్ గుప్తా తెలిపారు. ఖుష్బూ ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ నోట్ వ్రాయలేదని పోలీసులు అన్నారు. ఖుష్బూ మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ర్యాగింగ్ కారణంగానే ఖుష్బూ ఆత్మహత్య చేసుకునిందని ఆమె స్నేహితులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications