శుభవార్త: మీడియా, వినోద రంగాల్లో 8 లక్షల మందికి ఉద్యోగాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: మీడియా, వినోద రంగాల్లో వచ్చే ఐదేళ్ళలో పెద్ద ఎత్తున ఉద్యోగ , ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఈ రంగాలు ఏటా 11-12శాతం వృద్ధి చెందుతున్నాయని నివేదిక ప్రకటించింది. వచ్చే ఐదేళ్ళలో ఈ రంగాల నుండి ఏకంగా 7-8 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నాయని సీఐఐ-బీసీజీ నివేదిక పేర్కొంది.

మీడియా, వినోద రంగాల వారికి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభ్యమయ్యే అవకాశాలున్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రతి ఏటా ఈ రంగాల్లో గ్రోత్ ఉండడం కూడ ఆశాజనక ఫలితాలను తెలుపుతోంది.

మీడియా, వినోద రంగాల్లో పనిచేసే వారికి భవిష్యత్‌ ఆశాజనకంగా ఉందని ఈ నివేదికలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి.

మీడియా, వినోద రంగాల్లో ఉపాధి

మీడియా, వినోద రంగాల్లో ఉపాధి

మీడియా, వినోద రంగాల్లో వచ్చే ఐదేళ్ళలో పెద్ద ఎత్తున ఉద్యోగ , ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయి. సుమారు 7-8 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభ్యం కానున్నాయని సీఐఐ -బీసీజీ నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పెరగడం, డిజిటల్‌గా కనెక్ట్‌ అయ్యే వినియోగదారులు ఎక్కువ కావడం వంటి అంశాలు ప్రభావితం చూపుతున్నాయని నివేదికలు తెలుపుతున్నాయి.

శిక్షణ పొందిన వారి అవసరం

శిక్షణ పొందిన వారి అవసరం

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ భిన్నమైన ఉద్యోగులతో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని సీఐఐ-బీసీజీ నివేదిక అభిప్రాయపడింది. ఏటా 1.4-1.6 లక్షల మంది శిక్షణ పొందిన వారి అవసరం ఐదేళ్ల పాటు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.

క్రియేటీవిటీ ఉంటే అవకాశాలు

క్రియేటీవిటీ ఉంటే అవకాశాలు

డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ అన్నవి ఓ వ్యాపకంలా మారాయి. ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో అవకాశాలున్నాయి. ముఖ్యంగా క్రియేటర్లు, స్టోరీ టెల్లర్, టెక్నాలజీ ప్రొవైడర్లకు అధిక అవకాశాలున్నాయి అని సీఐఐ డెరెక్టర్‌జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ చెప్పారు.

ఉపాధి అవకాశాలు

ఉపాధి అవకాశాలు

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మీడియా, ఎంటర్‌టైన్ మెంట్ రంగాల్లో రానున్న ఐదేళ్ళలో దొరకనున్నాయి. అయితే ఆయా రంగాల్లో ఉపాధి లభించాలంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శిక్షణను పొంది ఉండాలి. అంతేకాదు క్రియేటీవిటీ ఉంటే ఈ రంగంలో పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India's media and entertainment industry is expected to clock a strong double digit growth in the range of 11-12 per cent and poised to add another seven to eight lakh new jobs over the next five year, says a report.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి