Neela క్యూట్ వెల్కమ్.. మురిసిపోయిన ఓటర్లు

సాధారణంగా పోలింగ్ కేంద్రం అనగానే క్యూ లైన్లు, పోలీసులు, గంభీరమైన వాతావరణం గుర్తొస్తుంది. కానీ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఓటర్లను దేవుళ్లుగా భావిస్తూ ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన వినూత్న సౌకర్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ప్రజాస్వామ్య పండుగలో టెక్నాలజీ తోడైతే ఎలా ఉంటుందో పుదుచ్చేరి ఎన్నికలు నిరూపించాయి.

గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగానే, బౌలేవార్డ్‌లోని వి.వో. చిదంబరనార్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఓటర్లకు ఒక వింత అనుభవం ఎదురైంది. అక్కడ ఒక అందమైన రోబో చేతిలో పూల ట్రే పట్టుకుని ఓటర్లకు సాదర స్వాగతం పలికింది. దాని పేరే 'నీలా'.

Meet Neela The Humanoid Robot Welcoming Voters With Roses at Puducherry Assembly Election Polling Booths

'రోబో మిర్రర్' అనే సంస్థ రూపొందించిన ఈ 'నీలా' రోబోట్, పోలింగ్ కేంద్రం వద్ద ఒక స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించింది. కేవలం బొమ్మలా నిలబడటమే కాకుండా, ఓటర్లను పలకరిస్తూ.. "పోలింగ్ కేంద్రానికి స్వాగతం.. నేను మీ ఎన్నికల సహాయ రోబోను. దయచేసి క్యూలో వెళ్ళండి, మీ ఓటర్ కార్డు సిద్ధంగా ఉంచుకోండి" అంటూ స్పష్టమైన వాయిస్‌తో సూచనలు అందించింది. ఒకటి కంటే ఎక్కువ భాషల్లో మాట్లాడగలిగే సామర్థ్యం ఉండటంతో స్థానిక ఓటర్లు అవాక్కయ్యారు.

ఎవరీ నీలా?

కోయంబత్తూర్‌కు చెందిన రోబో మిర్రర్ ప్రతినిధి కౌశిక్ తెలిపిన వివరాల ప్రకారం.. నీలా అనేది ఒక ఈవెంట్-ఆధారిత రోబోట్. పెళ్లిళ్లు, సభలు, ఎన్నికల వంటి కార్యక్రమాల కోసం దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ముందుగానే ప్రోగ్రామ్ చేసిన వాయిస్ సిస్టమ్ ద్వారా ఇది ప్రజలతో కమ్యూనికేట్ చేస్తుంది. ఈ రోబో ఉనికి వల్ల ముఖ్యంగా వృద్ధులు, మొదటిసారి ఓటు వేసే యువతలో ఉత్సాహం కనిపించింది.

వృద్ధులకు, యువతకు Neela పెద్ద సాయం..

సాధారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉండే గందరగోళం నీలా వల్ల చాలా వరకు తగ్గింది. ఎటు వెళ్లాలి? ఏం చేయాలి? అని కంగారు పడేవారికి ఈ రోబో మార్గనిర్దేశం చేయడంతో ప్రక్రియ సులభంగా మారింది. "ఓటు వేయడానికి వస్తే ఒక రోబో మమ్మల్ని పలకరించడం చాలా కొత్తగా, సరదాగా ఉంది" అని ఓటర్లు ముచ్చటపడ్డారు.

ఎన్నికల ప్రక్రియ అనేది కేవలం ఓటు వేయడమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలాంటి ఆధునిక ఆవిష్కరణలను కూడా ఆహ్వానించాలని పుదుచ్చేరి ఎన్నికల అధికారులు భావించారు. సంప్రదాయ పద్ధతులకు టెక్నాలజీ తోడైతే పనులు ఎంత వేగంగా, ఆకర్షణీయంగా జరుగుతాయో 'నీలా' నిరూపించింది.

కీళూర్‌లో స్వాతంత్య్ర చరిత్ర దర్శనం..

మంగలం అసెంబ్లీ నియోజకవర్గంలోని కీళూర్ ప్రభుత్వ మధ్య పాఠశాలను ఒక ప్రత్యేకమైన 'మోడల్ పోలింగ్ కేంద్రం'గా తీర్చిదిద్దారు. లోపలికి వెళ్లగానే తమిళ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు ఓటర్లను కట్టిపడేశాయి. పూర్వపు పాండిచ్చేరి స్వాతంత్ర్య పోరాట చరిత్రను వివరించే ఫ్లెక్సీ బోర్డులను ఇక్కడ ఏర్పాటు చేశారు. పర్యావరణ హిత వస్తువులతో (Eco-friendly) అలంకరించిన ఈ కేంద్రం ఓటర్లకు ఒక విహారయాత్రకు వెళ్లిన అనుభూతిని ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+