రాజకీయాలు ఎంటర్‌టెయిన్మెంట్ అవ్వకూడదు: యువ సెఫాలజిస్ట్ శ్రీపాద్ నందన్

రాజకీయ రంగం రణరగంగా మారిన తరుణంలో రాజకీయ విశ్లేషకులు, రాజకీయ చాణక్యులు తమతమ తర్కాలతో ఉపాయాలతో రాజకీయ నాయకులకి బలాన్ని చేకూరుస్తున్నారు. ఇలాంటివారు సాధారణంగా మనకు జుట్టు నెరిసిన వారు, సుధీర్ఘ కాలంగా రాజకీయాలను ఫాలో అయ్యే వారుంటారు. కానీ ఓ కుర్రాడు తన తెలివితో, ఆధునిక విధానాలతో, సాంకేతిక ప్రయోగాలతో 2019లో ప్రస్తుత తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల క్యాంపెయిన్‌‌లో తనదైన వ్యూహాలను అందించి శభాష్ అనిపించుకున్నాడు. అతనే శ్రీపాద్ సాయి నందన్, చిన్న వయసులోనే రాజకీయ క్షేత్రంలో తనదైన ముద్ర వేసి ఆబ్సల్యూట్ పొలిటికో(AbsolutePolitico) అనే సంస్థను స్థాపించి రాజకీయ నాయకులకు తన సేవలను అందిస్తున్నారు. నందన్‌తో వన్ ఇండియా మాటా మంతి..

రాజకీయ క్షేత్రాన్ని ఎంచుకోవడం వెనుక కారణం? మీ ప్రయాణం గురించి చెప్పండి.

శ్రీపాద్ నందన్ : నాకు చిన్నప్పటి నుండి రాజకీయాల మీద మక్కువ ఎక్కువగా ఉండేది. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు టీవీలో చూసేవాడ్ని. ఇంజినీరింగ్ తరువాత నాకున్న సాంకేతిక జ్ఞానం రాజకీయ ప్రచారానికి ఉపయోగిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని కలిసాను. ఆయనకి నా అలోచనలు నచ్చి అవకాశం ఇచ్చారు ఆయన గెలుపుతో నాకు కుడా పేరొచ్చింది. రక రకాల పార్టీల నుంచి రాజకీయ నాయకులు కలవడం నా సేవలు అందించడం జరిగింది.

sripad Nandan

తెలంగాణాలో మాత్రమేన లేక ఇతర రాష్ట్రాలలో కూడా పని చేస్తున్నారా?

శ్రీపాద్ నందన్ : ప్రస్తుతం తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువగా పని చేస్తున్నాము. రానున్న రోజుల్లో మరిన్ని రాష్త్రాలలో పని చేసే అవకాశాలు ఉన్నాయి.

మీరు పార్టీలకి పని చేస్తున్నారా లేక నాయకులకి వ్యక్తిగత స్థాయిలో పని చేస్తున్నారా?

శ్రీపాద్ నందన్ : అలా విడివిడిగా చూడట్లేదు మేము. పార్టీలకి కొన్ని ప్రత్యేకమైన సేవలు టెక్నాలజీ ఆధారంగా, స్ట్రాటజీ ఆధారంగా సేవలు అందిస్తున్నాము. ఇంకో పక్కన నాయకులకి వ్యక్తిగత స్థాయిలో కుడా పని చేస్తున్నాము.

ఈ రంగంలో చాలా కంపెనీలు ఇటీవల కాలంలో ఉద్భవించాయి. మీకు ఇతరులకి తేడా ఏంటి?

శ్రీపాద్ నందన్ : వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రాజకీయాలలో సహజమే. మేము దీన్ని పోటీ లాగా చూడట్లేదు. ఎవరికి తగ్గ పని వారికి ఖచ్చితంగా ఉంటుంది. మా దగ్గరికొచ్చే నాయకులకి ఎంతవరకు తోడ్పాటు ఇవ్వగలమో దాని మీదనే మా దృష్టంతా ఉంటుంది. సాంప్రదాయిక విధానాలు, టెక్స్ట్ బుక్ టాక్టిక్స్ కి భిన్నంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ కార్యకలాపాలని అనుసంధానించి వ్యూహాలను రూపొందిస్తాం. ఇలాంటి వ్యూహాలకి టెక్నాలజీని జోడించి కొత్త తరహాలో ఈ క్షేత్రంలో పని చేస్తున్నాం. ఇవే కాక మా సంస్థ తరఫున నూతన విధానలను సాంప్రదాయకంగా ఉండే విధానాలను జోడించి సర్వేలు కూడా చేస్తున్నాము.

టెక్నాలజీ వినియోగం వల్ల రాజకీయాల్లో ఎటువంటి ఉపయోగం ఉంటుంది?

శ్రీపాద్ నందన్ : చాలా ఉపయోగం ఉంటుంది. ప్రతి నాయకుడికి తన ఉద్దేశాలు, అలోచనలు ప్రజలకి తెలియపరచాలని ఉంటుంది. ఆ కమ్యునికేషన్ మరింత బలపరచడం, విస్తరించడం కోసం టెక్నాలజీని మా వ్యూహాలతో జోడించి ఎక్కువమంది ప్రజలను చేరుకునేలాగా మేము సేవలను అందిస్తున్నాము. వారి గెలుపునకు తోడ్పడుతున్నాము.

ఎలాంటి టెక్నాలజీలని వాడుతున్నారు?

శ్రీపాద్ నందన్ : ఆ లిస్టు చాల పెద్దదే కాని ముఖ్యంగా నూతనంగా మేము వాడేవాటి గురించి చెప్తాను. క్యు.ఆర్ కోడ్ ద్వారా రాజకీయ ప్రచార కార్యక్రమాలు మొదటిసారిగా చేసింది మేమే. 2019లో మొదటిసారిగా అది వాడినప్పుదు అనూహ్యమైన స్పందన లభించింది. అదే కాకుండా మా వద్ద పేటెంటెడ్ వి.అర్ టెక్నాలజీ కూడా వాడుతున్నాము. దాని ద్వారా నాయకులకి ప్రజలకి మధ్య దూరం తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ టెక్నాలజీ మరెవ్వరి వద్ద లేదు.

Sripad sai nandan

సోషల్ మీడియా మాధ్యమాల ద్వార మీరు బాధితులకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చేసే సేవ గురించి మీరు ఏం చెప్తారు?

శ్రీపాద్ నందన్ : సమస్యల్లో ఆడ మగ అన్న తేడాలు ఉండవండి. నేను కూడా అలా చూడను. ఇదంతా నేను వ్యక్తిగతంగా చేస్తున్నది. ఎందరో బాధితులు ఈ దేశ పౌరులుగా తమకుండే సౌలభ్యాల గురించి, హక్కుల గురించి తెలియక, ఎవరిని అడగాలో అర్ధంకాక బాధితులుగా మిగిలిపోతున్నారు అని గమనించి సమాజం పట్ల ఉడతా భక్తి సాయంగా నేను చేస్తున్నదే తప్ప అందులో ఎలాంటి మర్మం లేదు. రాజకీయాలకి సంబంధమే లేదు. సోషల్ మీడియా మాధ్యమాల్లో, బయట జరిగే వేధింపులని ఎదురుకునే మార్గాలని సూచించడం, దానికి కావాలసిన సాయం చెయ్యడమే నేను చేసేది. నా లాంటి వాళ్ళ అవసరం రాకూడదనేది నా కోరిక.

మీరు భవిష్యత్తు రాజకీయాల గురించి ఏమనుకుంటున్నారు?

శ్రీపాద్ నందన్ :సర్వేలు, వోట్ షేర్ లు, సీట్ల నంబర్లు ఎప్పుడూ ఉండేవే. ఈరోజు ఒక పార్టీ ఉంటుంది రేపు మరో పార్టీ వస్తుంది. ప్రజా స్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఇవి ఎప్పటికీ మారవు. రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ప్రజలు రాజకీయాలని ఎలా చూస్తున్నారన్న మీదే భవిష్యత్తు ఉంటుంది. ప్రజలను అలరించడానికి, వాళ్ళ దృష్టి ఆకర్షించడానికి చాలా సాధనాలు ఉన్నాయి. దీనివల్ల తమ జీవితాలని ప్రభావితం చేసే రాజకీయాల మీద అవగాహన లేమి రానంతవరకు ఎలాంటీ సమస్య ఉండదు. ఎప్పుడైతే మనకెందుకు అనే భావన గట్టిగా ఏర్పడుతుందో అప్పుడు సమస్యలు తలెత్తుతాయి. రాజకీయాలు కూడా అట్టెన్షన్ కోసం ఎంటర్ టైన్మెంట్ తో పోటీ పడే రోజులు వచ్చేసాయి. ఇది పరిధి దాటితేనే ప్రమాదం. రాజకీయానికి, నాయకులకి దూరం ఎక్కువగా పెరిగిపోతే కష్టం.

ఇదీ శ్రీపాద్ నందన్ యొక్క మనోగతం. చిన్న వయసులోనే రాజకీయ క్షేత్రంలో సాంప్రదాయక మరియు ఆధునిక పధ్ధతులని వాడి సంచలనాలను సృష్టిస్తున్న యంగ్ సెఫాలజిస్ట్ నందన్ ప్రయాణం ఎన్ని మలుపులు తిరుగుతుందో ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+