మేము పోలీసులు: ముగ్గురిపై గ్యాంగ్ రేప్
నోయిడా: పోలీసుల ముసుగులో వచ్చిన ఎనిమిది మంది కామాంధులు ముగ్గురు మహిళల మీద సామూహిక అత్యాచారం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో జరిగింది. గ్రేటర్ నోయిడాలోని కరోలి గ్రామంలో ఇటుక బట్టీలు ఉన్నాయి.
అక్కడ మహిళలు కూలీలుగా పని చేస్తున్నారు. గురువారం వేకువ జామున ఇంట్లోకి చొరబడిన దుండగులు తాము పోలీసులు అని అక్కడ ఉన్న మహిళలను బెదిరించారు. తరువాత ముగ్గురు మహిళల మీద సామూహిక అత్యాచారం చేశారు.
బయటకు వచ్చిన కామాంధులు ఇంటి బయట ఉన్న కోళ్లు ఎత్తుకుని అక్కడి నుంచి పరారైనారు. బాధితురాళ్లు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గ్రేటర్ నోయిడా ఎస్పీ సుజాతా సింగ్ తెలిపారు.

బాధితురాళ్లను వైద్య పరిక్షలకు తరలించామని ఎస్పీ సుజాతా సింగ్ చెప్పారు. దుండగులు ఇంట్లోకి చొరబడి మీరు ఇక్కడ అక్రమంగా సారా నిల్వచేశారని, గ్రామస్తులకు విక్రయిస్తున్నారని వారిని బెదిరించి అఘాయిత్యం చేశారని పోలీసులు అన్నారు.
నిందితులు మద్యం సేవించి ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తింటూ ముగ్గురు మహిళల మీద ఒకరి తరువాత ఒకరు అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. బాధితురాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications