MH Election 2024:మన ప్రాజెక్టులు గుజరాత్‌కు పట్టుకెళ్లారు:మోదీపై పై తెలంగాణ మంత్రులు ధ్వజం

నాందేడ్ / హైదరాబాద్:- మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాఅఘాడి కూటమి విజయం తధ్యమని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాందేడ్ ప్రాంతంలో ఆయన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి వివిధ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు న్యాయం జరగాలంటే మహాఅఘాడి కూటమి అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

మహాఅఘాడి కూటమిలో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుత దేశ, రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో మహా అఘాడి కూటమిని గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్రలో మహా అఘాడి కూటమి గెలుపు ఖాయమని ఇప్పటికే ఆ దిశగా సంకేతాలు కనిపిస్తున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు .త్వరలో మహరాష్ట్ర ఎన్నికల్లో మహ అఘాడి కూటమి ఘనవిజయం సాధించడం తధ్యమని మంత్రి పొంగులేటి అన్నారు.

MH election 2024 Maha Agadhi will win come to power says telangana minister Ponguleti Srinivas reddy

మహారాష్ట్ర శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి అధికారంలోకి రావడం ద్వారా మాత్రమే రాష్ట్రం కాంతివంతంగా వెలుగు జిలుగులు విరజిమ్ముతుందని తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఇక్కడ జరుగుతున్న ఎన్నికలపై యావత్ భారతదేశం దృష్టిలో సారించిందని ఆయన పేర్కొన్నారు.ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పు దేశ భవిష్యత్తును మలుపు తిప్పుతాయని ఆయన చెప్పారు.మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఏ.ఐ.సి.సి పరిశీలకుడిగా నియమితులైన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాందేడ్,ఔరంగబాద్, లాతుర్ వంటి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీ విభజన రాజకీయాలకు తెర లేపిందని దానిని తిప్పి కొట్టేందుకు మహారాష్ట్ర ప్రజలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.మహారాష్ట్రకు చెందిన 17 పారిశ్రామిక ప్రాజెక్ట్లను గుజరాత్ కు తరలించడంపై ఆయన మండిపడ్డారు.అటువంటి పార్టీకి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు.

MH election 2024 Maha Agadhi will win come to power says telangana minister Ponguleti Srinivas reddy

రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ సభల్లో పాల్గొనేందుకు వచ్చిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి నాందేడ్ విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల ప్రచార సభల్లో రాహుల్ గాంధీతో పాటు నాందేడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా నాందేడ్ న్యూ మొండా మైదానంలో జరిగిన బహిరంగ సభతో పాటు వివిధ సభల్లో రాహుల్ గాంధీతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+