కూలిన విమానం: ఐఏఎఫ్ పైలట్ మృతి, ఎన్‌సీసీ క్యాడెట్లకు గాయాలు
పాటియాలా: పంజాబ్ రాష్ట్రంలోని పాటియాలాలో సోమవారం విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలా ఏవియేషన్ క్లబ్‌కు చెందిన మైక్రోలైట్ విమానం కూలిపోవడంతో భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్ కమాండర్ మృతి చెందారు.
ఘటనకు సంబంధించిన వివరాలను వైమానిక అధికారులు వెల్లడించారు. పాటియాలలోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతంలో ఏవియేషన్ క్లబ్‌కు చెందిన మైక్రో లైట్ విమానం(పైపీస్ట్రెల్ వైరస్ ఎస్‌డబ్ల్యూ 80 శిక్షణ విమానం) కూలిపోయింది.

ఈ ప్రమాదంలో 3వ ఎయిర్ స్క్వాడ్రన్‌కు చెందిన వింగ్ కమాండర్ చీమ గుర్‌ప్రీత్ సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఎన్‌సీసీ క్యాడెట్ విపిన్ కుమార్ యాదవ్ తోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ఈ మైక్రో లైట్ విమానాలను ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణ కోసం ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications