Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారంలో మూడు రోజులు ఆఫీసులకు రావాల్సిందే

Microsoft: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కొమ్ములు తిరిగిన కంపెనీలు కూడా దీని బారిన పడుతున్నాయి. భారీగా ఉద్యోగాల్లో కోత పెడుతున్నాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్.. వంటి సంస్థలు సైతం ఇదివరకే దశలవారీగా లేఆఫ్స్ ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్ సైతం దీనికి మినహాయింపేమీ కాదు. దాదాపుగా 15,000 మంది ఉద్యోగులను తొలగించిందా టెక్ దిగ్గజం.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లిస్తోంది. మ్యాన్ పవర్ కంటే కూడా AI ని గట్టిగా నమ్ముకుందా సంస్థ. ఈ పరిస్థితుల మధ్య మైక్రోసాఫ్ట్ మరో ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ను మరింత కఠినతరం చేయనుంది. 'రిటర్న్ టు ఆఫీస్' (RTO) పాలసీని మరంత టైట్ చేయనుంది. ఇందులో భాగంగా టఫ్ అటెండెన్స్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది.

Microsoft Announces Mandatory 3-Day Office Attendance by 2026

దీనికి సంబంధించి ఉద్యోగులందరికీ కూడా ఇంటర్నల్ ఇమెయిల్స్ పంపించింది. మైక్రోసాఫ్ట్ సంస్థ ఉద్యోగులు 2026 జనవరి నుంచి వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాలని ఆదేశించింది. మొదట పూగెట్ సౌండ్ ప్రాంతంలో ఈ విధానం అమలులోకి వస్తుంది. ఆ తర్వాత అమెరికాలోని ఇతర ప్రాంతాలకు, అనంతరం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. సంస్థ ఈ కొత్త కఠిన నిబంధనలను దశలవారీగా అమలు చేయనుంది.

ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ వర్క్ పాలసీని అమలు చేస్తోంది మైక్రోసాఫ్ట్. వర్క్ ఫ్రమ్ హోమ్ సహా ఉద్యోగులు ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వొచ్చు. తమ టీమ్ లీడ్ లేదా డివిజన్ మేనేజర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా 50 శాతం వర్కింగ్ అవర్స్ రిమోట్‌గా పనిచేయడానికి అవకాశం ఉంది. ఈ విధానాన్ని తొలగించింది. ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయానికి రావాలనే నిబంధనను మైక్రోసాఫ్ట్ మరింత కఠినతరం చేస్తోంది. దీనిని జనవరి నుంచి అమలులోకి తెస్తుంది.

మైక్రోసాఫ్ట్ తమ బ్లాగ్ పోస్ట్‌లో ఈ నిర్ణయం వెనకున్న కారణాలను స్పష్టం చేసింది. తమ టీమ్స్ ఎలా పని చేస్తున్నానే విషయాన్ని పరిశీలించామని, ఫిజికల్ గా కలిసి పని చేసినప్పుడు, వారి పనితీరు మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్లు తెలిపింది. ఒకరినొకరు పలకరించుకుంటూ మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా, శక్తిమంతంగా పని చేయగలుగుతారని, ఫలితంగా మరిన్ని మంచి ఫలితాలను అందిస్తారని పేర్కొంది.

జనవరి నుంచి వారంలో మూడు రోజులపాటు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు ఖచ్చితంగా ఆఫీసులకు వెళ్లాల్సి ఉంటుంది. మొదటి దశలో పూగెట్ సౌండ్ ప్రాంతంలో ఫిబ్రవరి చివరి నాటికి ప్రారంభిస్తారు. రెండో దశలో ఇతర అమెరికాలోని ఇతర ప్రాంతీయ కార్యాలకాలకు దీన్ని విస్తరిస్తుంది. ఆ తర్వాత అమెరికా వెలుపల ఉన్న అన్ని కార్యాలయాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేస్తుంది.

పూగెట్ సౌండ్ ఏరియాలో ఉండే మైక్రోసాఫ్ట్ కార్యాలయానికి 80 కిలోమీటర్ల దూరం పరిధిలో నివసించే ఉద్యోగులు 2026 ఫిబ్రవరి చివరి నాటికి వారానికి మూడు రోజులు కార్యాలయానికి వచ్చి పని చేయాలి. వీరికి వ్యక్తిగత ఇమెయిల్ ద్వారా పూర్తి వివరాలు అందుతాయి. ప్రస్తుతానికి పూగెట్ సౌండ్ ఏరియా వెలుపల ఉన్న ఉద్యోగుల గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. నిర్దేశిత ఆదేశాలు అందిన తర్వాత వారిని రిటర్న్ టు ఆఫీస్ పరిధిలోకి తెస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+