బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాన్: తీరాన్ని దాటేది అక్కడే: భారీ వర్షాలు..!!

భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారింది. ఇది మరింత బలపడి వచ్చే 12 గంటల వ్యవధిలో తుఫాన్‌గా మారనుంది. దీని ప్రభావంతో ఏపీ సహా తీర ప్రాంత రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ వాయుగుండంగా తుఫాన్‌గా మారడానికి అనువైన వాతావరణం ఉన్నట్లు భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో ఏర్పడిన తుఫాన్ తరహా వాతావరణం (Cyclonic circulation) క్రమంగా పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతూ, అండమాన్ దక్షిణ ప్రాంతంలో ప్రవేశించినట్లు వివరించింది.

Midhili cyclone to make landfall in Bangladesh

ఈ తుఫాన్‌కు మిధిలీ (Midhili cyclone) అని పేరు పెట్టారు. దీని ప్రభావంతో తమిళనాడు మొదలుకుని ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ దక్షిణ తీర ప్రాంత జిల్లాల వరకూ నేటి నుంచి 20వ తేదీ వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ వాయుగుండం మరింత బలపడుతుందని, తుఫాన్‌గా మారుతుందని ఐఎండీ వివరించింది.

గురువారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం ఒడిశాలోని పారాదీప్‌కు ఆగ్నేయ దిశగా 190, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 280, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారాకు 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది బంగ్లాదేశ్ వైపు కదులుతుందని,
శనివారం తెల్లవారు జాము నాటికి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా- ఖేపుపారా మధ్య తీరాన్ని దాటుతుందని ఐఎండీ తెలిపింది.

ఈ తుఫాన్ (Cyclone Midhili) తీరానికి సమీపిస్తోన్న కొద్దీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ చేపలవేటకు వెళ్లకూడదని సూచించింది.

దీని ప్రభావం ఒడిశా ఉత్తర ప్రాంతం, పశ్చిమ బెంగాల్‌పై అధికంగా ఉంటోంది. తీర ప్రాంత జిల్లాలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం చేశాయి. ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటోన్నాయి. వర్షాలు అధికంగా కురిసే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+