• search

రూ.500 ఎక్కువ అడిగిందని! సెక్స్ వర్కర్ కు నరకం చూపించారు..

Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : ఆకలి.. నిద్ర.. బట్ట.. అన్నీ డబ్బుతో ముడిపడి ఉన్నవే. అవసరాలు తీరాలంటే.. వాళ్లా రాత్రికి ఏ మాసిపోయిన బొంతపైనో రెండు చుక్కలై ఇంకిపోవాల్సిన అనివార్య స్థితి. కుచించుకుపోయే రాత్రుల్లో.. రాత్రంతా కోతకు గురవుతూ.. మౌనంగా కన్నీళ్లను దిగమింగుకోవాల్సిందే.

  పొట్ట కూటి కోసం.. కుటుంబ అవసరాల కోసం దేశంలో ఎంతోమంది మహిళలు పడుపు వృత్తిలోకి దిగుతున్న నేపథ్యంలో.. ఇదే తరహాలో కుటుంబ అవసరాల కోసం సెక్స్ వర్కర్ అవతారమెత్తిన ఓ ముంబై వివాహిత రూ.500 కోసం కామాంధుడి చేతిలో నరకయాతన అనుభవించింది. బెల్టుతో బాది, సిగరెట్లతో ఒళ్లంతా కాల్చి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నాడు ఓ ప్రబుద్దుడు.

  ముంబైకి చెందిన అతుబాకు ఓ సెక్స్ వర్కర్ తో చాలాకాలంగా పరిచయం ఉంది. ఆమెతో చాలాసార్లు సెక్స్ లో పాల్గొన్నాడు కూడా. అలా కలిసిన ప్రతీసారి ఆమెకు రూ.1000 చెల్లిస్తూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఓరోజు ఆమెను పిలిపించుకున్న అతుబా.. పని పూర్తయ్యాక యథావిధిగా వెయ్యి రూపాయల నోటు తీసి చేతిలో పెట్టాడు. అయితే ఇంట్లో తీవ్రమైన సమస్యలు వెంటాడుతుండడంతో మరో రూ.500 అదనంగా చెల్లించాల్సిందిగా కోరింది సదరు సెక్స్ వర్కర్.

  Miffed over extra RS 500 demand, man tortures sex worker for 4 hours

  దీంతో ఆగ్రహానికి గురైన అతుబా.. అతని స్నేహితుడు అప్జల్ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో ఆమెను తన గదికి పిలిపించుకున్న అప్జల్ ఆమెను శారీరకంగా అనుభవించాక చెప్పినట్లుగానే రూ.1500 చెల్లించాడు. అయితే అదే సమయానికి అక్కడకు వచ్చిన అతుబా మరోసారి ఆమెను శృంగారానికి ఒప్పించి సెక్స్ లో పాల్గొన్నాడు. అనంతరం ఆమె డబ్బులు అడగడంతో.. కోపంతో రగిలిపోయిన అతుబా బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టి సిగరెట్ తో శరీరమంతా వాతలు పెట్టాడు.

  రేప్ కేసు వద్దు.. చిత్రహింసల కేసు మాత్రమే పెట్టండి : సెక్స్ వర్కర్

  దాదాపు నాలుగు గంటల పాటు ఆమెను తీవ్ర చిత్రవధకు గురి చేసిన అతుబా, తెల్లవారుజామున మూడు గంటలకు జయదేవ ఆసుపత్రిలో వదిలిపెట్టిపోయాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించిన ఆమె చిత్రహింసల కేసు పెట్టాల్సిందిగా కోరింది. గ్యాంగ్ రేప్ కేసు పెట్టాల్సి వస్తుందని పోలీసులు చెప్పినా వినని ఆ మహిళ.. తాను సెక్స్ వర్కర్ ను కాబట్టి రేప్ కేసు కాకుండా చిత్రహింసల కేసు పెట్టాలని సూచించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A sex worker who was tortured for four hours - burnt with cigarette butts and beaten with a belt - by a regular client kept her wits about and ensured that the accused's brutal behavior did not go unpunished.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more