వలస కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయొద్దు, భోజనం, వసతి కల్పించండి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికుల ప్రయణాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన రైళ్లు, బస్సుల్లో ఛార్జీలు వసూలు చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ఛార్జీలను భరించాలని స్పష్టం చేసింది.

అంతేగాక, తమ రాష్ట్రాల నుంచి వెళుతున్న వలస కార్మికులకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే ఆహారం, తాగునీరు అందించాలని ఆదేశించింది. రైల్వే స్టేషన్ చేరుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలకు భోజనం, నీరు అందించాలని, రైలు ప్రయాణంలో రైల్వే శాఖ ఆహారం, నీరు అందించాలని పేర్కొంది.

 Migrant cant be charged for travel by train or buses, States mustgive food and water where they are: SC

రిజిస్ట్రేషన్ చేసుకున్న వలస కార్మికులను తమ సొంత రాష్ట్రాలకు సాధ్యమైనంత త్వరగా పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
సొంత రాష్ట్రాలకు వెళుతున్న వలస కార్మికులను ఎవరూ ఆపకూడదని స్పష్టం చేసింది.

ఎవరైతే వలస కూలీలు నడుచుకుంటూ వెళుతున్నారో వారికి వెంటనే ఆహారం, తాగునీరు అందించాలని, వారికి వసతి కూడా కల్పించాలని కోర్టు ఆదేశించింది. రాష్ట్రాలు కోరిన వెంటనే రైల్వే శాఖ ఆలస్యం చేయకుండా రైళ్లను ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన వివరాలను వచ్చే శుక్రవారంలోగా తమకు అందజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

కాగా, వలస కూలీలు తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ రాష్ట్రానికి చెందిన కార్మికులను తీసుకువచ్చేందుకు ఇప్పటికే బస్సులను ఏర్పాటు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+