coronavirus lockdown: శ్మశానం నుంచి పళ్లు సేకరణ, రాజధానిలో వలసకూలీల ఆకలికేకలు...

లాక్‌డౌన్ పొడిగించడంతో పేదల ఆకలి కేకలతో దేశం మిన్నంటుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో గల శ్మశానం వద్ద ఆహారం కోసం పేదలు చూస్తున్నారు. దహన సంస్కారాల తర్వాత అక్కడ పళ్లు, ఫలాలు వేయడంతో.. అరటి పళ్లను తింటూ పొట్టపోసుకుంటున్నారు. దహన సంస్కారాలకు పెట్టిన పళ్లను తింటూ జీవిస్తున్న దుర్భర స్థితి మనస్సున్న ప్రతీ ఒక్కరిని కలచివేస్తోంది.

 Migrants Pick Bananas Trashed Near Delhi Cremation Ground

లాక్ డౌన్ వల్ల వలస కూలీలకు చేతికి పని లేదు, తినడానికి తిండి లేదు. అలాగని తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా అనుమతించడం లేదు. దీంతో యమునా నది ఒడ్డున గల శ్మశాన వాటిక వద్ద కొందరు కూలీలు గుమిగూడారు. నిగమ్ బోధ్ ఘాట్ అతిపెద్ద శ్మశాన వాటిక.. ఇక్కడ అంత్యక్రియలు చేసే సమయంలో వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు పెడుతుంటారు. ప్రస్తుతం అరటి పళ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది తినడానికి తిండిలేని వలసకూలీల పాలిట వరంగా మారింది. తమకు రోజు ఆహారం దొరకడం లేదు అని, అందుకే అరటిపళ్లను తీసుకుంటున్నామని చెబుతున్నారు.

Recommended Video

    Coronavirus: Deoband Mosque Now Centre For COVID 19 Spread Like Nizamuddin Markaz

    ఇదివరకు ఇలాంటి పరిస్థితి లేదు. కానీ లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటించే బదులు.. ఏదో ఒకటి తినాలనే ఉద్దేశంతో అరటిపళ్లను సేకరిస్తున్నారు. రెండురోజుల తర్వాత ఆహారం దొరికిందని కుమార్ అనే వలసకూలీ చెప్పారు. వలస కూలీలకు ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో ఆశ్రయం కల్పిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+