మళ్లీ తెగబడ్డ పాక్ ఉగ్రవాదులు : కుల్గాంలో సైన్యంపై కాల్పులు
కశ్మీర్ : భారత్ పాక్ నియంత్రణ రేఖ వద్ద ఉత్కంఠకు గురిచేసే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేసిన నేపథ్యంలో.. పాక్ అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, కశ్మీర్ లోని కుల్గాం ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్త ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దు వెంబడి భారీ భద్రతా దళాలను మోహరించింది భారత్. పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా సరిహద్దు వెంబడి పహారా కాస్తున్నారు. ఇదే సమయంలో కుల్గాం ప్రాంతంలోకి చొరబడ్డ పాక్ ఉగ్రవాదులు భారత్ పై కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. ప్రస్తుతం భారత బలగాలు పాక్ ఉగ్ర చర్యలను తిప్పికొట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి. దీనికి సంబందించి పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications