మరోసారి రెచ్చిన ఉగ్రవాదులు: పోలీసు వాహనంపై కాల్పులు
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు దిగారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జాతీయ రహదారిలో పోలీసులు ఓ వాహనంలో జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఆ వాహనంపై ముష్కరులు కాల్పులకు దిగారు.
కుల్గాం జిల్లా క్వీజీగుండ్ సమీపంలోని బోనిగాం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నుంచి పోలీసులంతా క్షేమంగా బయటపడ్డారు.

కాగా, పుల్వామా జిల్లాలోని అవంతిపురలోని జిల్లా పోలీసు లైన్స్ వద్ద అనుమానితుల కదలికలతో గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు గాల్లోకి కాల్పులు జరిపాడు. శుక్రవారం తెల్లవారుజామున అనుమానితుల కదలికలతో అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications