MIM: పాక్‍లో ఉన్న కులభూషణ్ జాదవ్‍ను మరిచిపోయారా.. అసదుద్దీన్ ఒవైసీ..
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆల్ ఇండియా మజిలీస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. హర్యానాలోని నుహ్‌లో "750 ముస్లిం యాజమాన్యంలోని" నిర్మాణాలు ఎందుకు కూలగొట్టరాని ప్రశ్నించారు. బిల్కిస్ బానో రేపిస్టులు ఎందుకు ముందుగానే జైలు నుంచి విడుదలయ్యారని నిలదీశారు. మోడీ ప్రభుత్వం భారతదేశంలో "ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషపూరిత వాతావరణాన్ని" ఎందుకు సృష్టించిందన్నాడు.
యూపీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి, రాజవంశ పాలనపై ప్రస్తావిస్తూ ట్రెజరీ బెంచ్‌లు "క్విట్ ఇండియా" నినాదాన్ని ఉపయోగించడంపై దాడి చేస్తూ, మోను మానేసర్ వంటి వ్యక్తులే భారతదేశాన్ని విడిచిపెట్టాలని ఒవైసీ అన్నారు. "మన హోం మంత్రి (అమిత్ షా) నిన్న 'క్విట్ ఇండియా' గురించి మాట్లాడుతున్నారు. ఈ పదబంధాన్ని ఒక ముస్లిం సృష్టించాడని అతనికి తెలిస్తే ఆశ్చర్యపోతాడు. అతనికి తెలిస్తే ఈ పదబంధాన్ని ఉపయోగించడు" అని ఒవైసీ అన్నారు.

"మీరు (కేంద్ర ప్రభుత్వం) చేస్తున్న రాజకీయాలు దేశానికి హాని కలిగిస్తాయని నేను చెప్పాలనుకుంటున్నాను. దేశం కంటే హిందుత్వ ముఖ్యమా అని నేను ప్రధానిని అడగాలనుకుంటున్నాను. మీరు 'క్విట్ ఇండియా' అంటున్నారు, 'క్విట్ ఇండియా చైనా' లేదా 'క్విట్ ఇండియా మోను మానేసర్' అని ఎందుకు అనరు. కులభూషణ్ జాదవ్ గురించి మరచిపోయారా? అతను పాకిస్థాన్‌లో ఉన్నాడు. ఖతార్‌లో ఏడాది కాలంగా జైల్లో ఉన్న ఎనిమిది మంది భారత నేవీ అధికారులను మరిచిపోయారా?" అని ప్రశ్నించారు.
దేశంలో "ద్వేషపూరిత వాతావరణం" సృష్టించబడుతుందని, నుహ్‌లో హింస మరియు మహారాష్ట్రలో రైలులో నలుగురు ప్రయాణికులను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కానిస్టేబుల్ కాల్చిచంపడానికి కారణమని ఆరోపించారు. "ఇటీవల, యూనిఫాం ధరించిన కానిస్టేబుల్ తన సీనియర్‌పై గడ్డం చూసి చంపాడు. మీరు ఈ దేశంలో జీవించాలంటే మోడీకి ఓటేయాల్సిందేనని అన్నారు. నేను ప్రధానిని అడగాలనుకుంటున్నాను" అని అన్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications