మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి బ్రహ్మరథం
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్థన్‌రెడ్డి ఐదు సంవత్సరాల తరువాత మళ్లీ బళ్లారికి వచ్చారు. మంగళవారం సాయంత్రిం గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి చేరుకున్నారు. ముందుగా చెళ్లగురి యర్రితాతను, బళ్లారిలో దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన తరువాత గాలి జనార్థన్‌రెడ్డి తన తల్లిదండ్రుల పేరుతో ఉన్నవృద్ధాశ్రమం దగ్గరకు వెళ్లారు.
తరువాత అక్కడున్న వృద్ధులను పరామర్శించారు. గాలి జనార్థన్‌రెడ్డికి వేలాధి మంది ఆయన అభిమానులు బళ్లారిలో బ్రహ్మరథం పట్టారు. బళ్లారిలోని తన ఇంటికి వెళ్లిన గాలి జనార్దన్‌రెడ్డికి ఆశ్చర్యాన్ని కలిగించిన ఓ ఘటన ఎదురైయ్యింది. ఐదు సంవత్సరాల క్రితం గాలి పెంచుకున్నకుక్కలు ఆయనను గుర్తు పట్టి ఆప్యాయంగా ముద్దాడాయి.
ఆ ఘటనతో గాలి జనార్ధన్‌రెడ్డి కళ్లలో నీళ్లు తిరిగాయి. పెంపుడు కుక్కలు అంటే గాలి జనార్దన్ రెడ్డికి ప్రాణం. ఆ పెంపుడు కుక్కలకు కూడా గాలి జనార్దన్ రెడ్డి అంటే ఎనలేని విశ్వాసం. గాలికి ఎన్నిపనులు ఉన్నావాటిని పక్కన పెట్టి పెంపుడు కుక్కలకు ఆమనే స్వయంగా అన్నం పెట్టేవారు.

ఇలాంటి పెంపుడు కుక్కలకు తన యజమాని దూరం అయిపోయాడని ఇంత కాలం మౌనగంగా రోదిస్తున్నాయి. ఇప్పుడు గాలి కనపడటంతో ఆ పెంపుడు కుక్కల ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఐదు సంవత్సరాల తరువాత అన్నం పెట్టి పెంచిన యజమాని వస్తే అంతులేని ఆనందంతో ఊగిపోయాయి.
గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె బ్రహ్మిణి పెళ్లి ఏర్పాట్లుకు బళ్లారికి వచ్చారు. గాలి జనార్దన్ రెడ్డి తన ఇంటికి వెళ్లగానే తాను పెంచుకున్న టైగర్, చిన్నోడు, పెద్దోడు అనే మూడు కుక్కలు ఆయనను చూడగానే పట్టలేనంత ఆనందంతో ఆయన మీదకి ఎగిరాయి.
గాలి చుట్టూ తిరగడం, ఆయన మీద పడి అరవడం, నోటితో వాసన చూస్తూ తిరుగుతూ ఆనందం వ్యక్తం చేశాయి. ఇది చూసిన గాలి అనచురులు ఆశ్చర్యపోయారు. ఇదే కుక్కలకు ఉన్న విశ్వాసం. గాలి జనార్దన్ రెడ్డి కూడా వాటి దగ్గరికి వెళ్లి చేతితో తడుముతూ చిన్నోడా, పెద్దోడా, టైగర్ అంటూ పలకరించారు.












Click it and Unblock the Notifications