Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నామాటే శాసనం, అన్ని చేసి నిరుపిస్తా అని పబ్లిక్ గా చాలెంజ్ చేసిన గాలి జనార్దన్ రెడ్డి !

బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే, గతంలో కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉంది. హంగ్ వస్తే కింగ్ మేకర్ కావాలని కలలు కన్న జేడీఎస్ పార్టీకి కేవలం 19 సీట్లు మాత్రమే రావడంతో ఆ పార్టీ నాయకులు డీలాపడిపోయారు.

ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి 113 మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు అనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 135 ఎమ్మెల్యేలు వచ్చారు. ఇక సిట్టింగ్ మంత్రులతో పాటు మాజీ సీఎం కొడుకులు ఓడిపోయారు. కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఆయన స్థాపించిన కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ నుంచి గంగావతి నియోజక వర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

Mining king, MLA Gali Janardhan Reddy promised to fulfill the promises made to the people of Gangavati.

బీజేపీతో తెగతెంపులు చేసుకున్న గాలి జనార్దన్ రెడ్డి సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో వారి పక్కన ప్రత్యక్షం అయ్యి అందరికి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిపించిన గంగావతి ప్రజలకు తాను న్యాయం చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి గంగావతి ప్రజలకు హామీ ఇచ్చారు.

గంగావతి ఓటర్లకు గాలి జనార్దన్ రెడ్డి విందుభోజం ఏర్పాటు చేశారు. తన మీద నమ్మకంతో తనను గెలిపించిన ఓటర్లకు తాను రుణపడి ఉంటానని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గంగావతి ప్రజకు తాను ఇచ్చిన ఎన్నికల హామీలను రెండు సంవత్సరాలలోపు పూర్తి చేస్తానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

ఆరు నెల్లోనే గంగావతిలో మహిళల కోసం గార్మెంట్స్ ఫ్యాక్టరీని స్థాపించి తనను నమ్ముకున్న వారికి ఉద్యోగాలు ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. గంగావతి పరిసర ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో తన పార్టీ కార్యాలయాలు స్థాపించి సొంతంగా వాలంటీర్లను ఏర్పాటు చేస్తానని, వాలంటీర్లు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారని, ఆ సమస్యలు తీర్చడానికి తాను సిద్దంగా ఉంటానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

Mining king, MLA Gali Janardhan Reddy promised to fulfill the promises made to the people of Gangavati.

గంగావతి అసెంబ్లీ నియోజక వర్గంలోని ఇరకల్ గడ ఏరియాలోని మెట్ట ప్రాంతాల్లో ఉండే ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా అయ్యేలా తాను చర్యలు తీసుకుంటానని గాలి జనార్దన్ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. మురికివాడలు శుభ్రంగా ఉండేలా చూస్తానని, గంగావతి నియోజక వర్గంలో రోడ్లు వేయిస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

తనను గెలిపించిన గంగావతి ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటానని, వచ్చే ఎన్నికల్లో కూడా తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, కేఆర్ పీపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాకముందే తాను సిద్దరామయ్య సీఎం అయితే ఆయనకు పూర్తి మద్దతు ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+