రాజకీయాల్లోకి గాలి జనార్దన్ రెడ్డి రీ ఎంట్రీ, రహస్యం, బళ్లారి సరిహద్దు, అయితే బీజేపీ!

బెంగళూరు: కర్ఱాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక రాజకీయాల్లో చక్రం తిప్పడానికి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దం అయ్యారని సంకేతాలు వెలువడ్డాయి. బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫాం హౌస్ లో గురువారం గాలి జనార్దన్ రెడ్డి తన మద్దతుదారులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. అంతే కాకుండా ఆ సమావేశానికి గాలి జనార్దన్ రెడ్డి అధ్యక్షత వహించారు. అయితే గాలి బ్రదర్స్ బీజేపీకి ఎలా సహాయం చేస్తారు అంటూ ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల్లో చర్చ మొదలైయ్యింది.

 ప్రముఖులు హాజరు

ప్రముఖులు హాజరు

గురువారం గాలి జనార్దన్ రెడ్డి నేతృత్వంలో జరిగిన సమావేశానికి దాదాపు 300 మందికి పైగా ప్రముఖులు హాజరైనారని ఓ ఆంగ్లవార్తా సంస్థ కథనం ప్రకటించింది. కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గాలి జనార్దన్ రెడ్డి రహస్య సమావేశాకి ప్రాధాన్యత ఏర్పడింది.

కాంగ్రెస్, బీజేపీకి పరువు, ప్రతిష్ట

కాంగ్రెస్, బీజేపీకి పరువు, ప్రతిష్ట

కర్ణాటకలో రెండు నెలల్లో జరగనున్న శాసన సభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీకి చావుబతుల సమస్యలాంటింది. రెండు పార్టీలు ఈ ఎన్నికలను పరువు, ప్రతిష్టగా భావిస్తున్నాయి. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ఎలాగైనా ఈ సారి కర్ణాటకలో మళ్లీ పాగా వెయ్యాలని భావిస్తోంది.

యూపీఏ నాశనం చేసింది

యూపీఏ నాశనం చేసింది

అక్రమ మైనింగ్ కేసులో తనను అప్పటి యూపీఏ సర్కారు ఇరికించి తన జీవితంతో చెలగాటం ఆడిందని గాలి జనార్దన్ రెడ్డి అనేకసార్లు ఆరోపించారు. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గాలి జనార్దన్ రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు చేసిన సీబీఐ దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన్ను జైల్లో పెట్టించింది.

రెడ్డి బ్రదర్స్ సహాయం

రెడ్డి బ్రదర్స్ సహాయం

గాలి జనార్దన్ రెడ్డి జైలు నుంచి జామీను మీద బయటకు వచ్చిన తరువాత బీజేపీకి దూరంగా ఉంటున్నారు. అయితే బీజేపీ నాయకులతో ఆయనకు ఇప్పటికీ సంబంధాలు ఉన్నాయని రాజకీయ నాయకులు అంటున్నారు.

బీజేపీ నాయకులు పరోక్షంగా గాలి జనార్దన్ రెడ్డి సహాయం తీసుకుంటారని తెలిసింది

ప్రతి సీటు విలువైనది

ప్రతి సీటు విలువైనది

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షం బీజేపీ ప్రతి శాసన సభ సీటు ప్రతిష్టాత్మకంగా తీసుకోంటుంది. బళ్లారితో సహ ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో గాలి జనార్దన్ రెడ్డికి మంచి పట్టు ఉంది. గాలి జనార్దన్ రెడ్డి నుంచి పరోక్షంగా సహాయం తీసుకుని ఆ జిల్లాల్లో వీలైనన్ని సీట్లు కైవసం చేసుకోవాలని కర్ణాటక బీజేపీ నాయకులు భావిస్తున్నారు.

సరిహద్దుల్లో ఫాం హౌస్

సరిహద్దుల్లో ఫాం హౌస్

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి జిల్లాలో అడుగుపెట్టడానికి వీల్లేదు. బళ్లారి-చిత్రదుర్గ జిల్లాల సరిహద్దులోని ఓ గ్రామంలో గాలి జనార్దన్ రెడ్డి ఓ ఫాం హౌస్ కొనుగోలు చేశారని, ఆయనకు అనుకూలంగా ఉండే విధంగా ఇప్పటికే మరమత్తులు చేయిస్తున్నారని ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

గాలి స్కెచ్, కాంగ్రెస్ ఫినీష్ !

గాలి స్కెచ్, కాంగ్రెస్ ఫినీష్ !

సిద్దరామయ్య ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి గాలి జనార్దన్ రెడ్డి శాసన సభ ఎన్నికల సందర్బంగా బళ్లారి-చిత్రదుర్గ జిల్లా సరిహద్దు నుంచి చక్రం తిప్పడనాకి సిద్దం అయ్యారని తెలిసింది. అందులో భాగంగా గురువారం బెంగళూరు నగర శివార్లలోని ఫాం హౌస్ లో గాలి జనార్దన్ రెడ్డి తన మద్దతుదారులతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి చర్చించారని ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రచురించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+