ఉగ్రవాదంపై ఐరాస భద్రతా మండలి సమావేశంలో జై శంకర్ కీలక వ్యాఖ్యలు... పాకిస్తాన్‌కు చురకలు...
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్(ISIL) అంతకంతకూ తన అడుగులను విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రాంతీయ,అంతర్జాతీయ భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని అన్నారు. అన్ని రకాల ఉగ్రవాద రూపాలను ఖండించాల్సిందేనన్నారు.మతం,జాతీయతలతో ఉగ్రవాదం ముడిపడకూడదన్నారు.న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో జై శంకర్ ఇస్లామిక్ ఉగ్రవాదంపై మాట్లాడారు.
'ఉగ్రవాదం కారణంగా భారత్ ఎన్నో సవాళ్లను,మరణాలను చవిచూసింది. 2008లో ముంబైపై,2016లో పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై,2019లో పుల్వామా దాడి జరిగింది. ఈ పరిణామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.' అని పేర్కొన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి బలైపోయినవారికి,వారి కుటుంబాలకు,ఇప్పటికీ ఉగ్రవాద సమస్యతో బాధపడుతున్నవారికి జైశంకర్ తన సానుభూతిని,సంఘీభాన్ని ప్రకటించారు.

ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని పరోక్షంగా ఆరోపించారు జై శంకర్ . అది ఆఫ్గనిస్తాన్ కావొచ్చు... లేదా ఇండియాకు వ్యతిరేకంగా కావొచ్చు... లష్కరే తోయిబా,జైషే మహమ్మద్ వంటి సంస్థలు యథేచ్చగా పనిచేస్తున్నాయి... వాటికి తగిన ప్రోత్సహం లభిస్తోందని అన్నారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల సమిష్ఠి పోరును బలహీనపరిచే దేశాలు కూడా ఉన్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌కు చురకలంటించారు. దీన్ని దాటవేయలేమని పేర్కొన్నారు.
అమాయక యువతను సాయుధులుగా మార్చే ఆన్‌లైన్ క్యాంపెయిన్స్ ఒక ఆందోళనకర పరిణామని పేర్కొన్నారు. ఐఎస్ఐఎస్ సంస్థ ఆర్థిక మూలాలు ఇప్పుడు మరింత పరిపుష్ఠమయ్యాయని... మనుషుల చంపినవాళ్లకు బిట్ కాయిన్స్ రూపంలో చెల్లింపులు జరుపుతున్నారని అన్నారు. వనరులను సమకూర్చుకోవడంలో,తమ ప్లాన్స్‌ను అమలుచేయడంలో... ఉగ్రవాద సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త పంథాను అనుసరిస్తున్నాయని అన్నారు. కౌన్సిల్‌లోని ఇతర సభ్య దేశాలు కూడా ఉగ్రవాదాన్ని ముక్తం కంఠంతో ఖండించాయి.
Recommended Video
ఇదే సమావేశంలో కోవిడ్ అంశాన్ని కూడా జై శంకర్ ప్రస్తావించారు. ఉగ్రవాదం కన్నా కోవిడ్ మరింత వాస్తవమని అన్నారు. మనందరం సేఫ్ అయితే తప్ప మనలో ఎవరూ సేఫ్ కాదన్నారు.
ఆఫ్గనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐరాస చీఫ్ ఆంటానియో గుటెరస్ ఇటీవల పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గనిస్తాన్ మరోసారి వేదిక కాకుండా,ఉగ్ర సంస్థలు దాన్ని సురక్షిత స్థావరంగా చేసుకునే అవకాశం ఇవ్వకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆఫ్గనిస్తాన్‌లో పరిస్థితులపై ఐరాస అత్యవసరంగా నిర్వహించిన సెక్యూరిటీ కౌన్సిల్ సమావేశంలో గుటెరస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications