బెంగళూర్ రెయిన్స్: కేంద్రంపై కేటీఆర్ కస్సు బుస్సు, విదాన సౌధలో ఇలా
వర్షంతో బెంగళూర్ తడిసి ముద్దయ్యింది. గల్లీలు నదులను తలపించాయి. జనం కష్టాలు మాములుగా ఉండటం లేదు. విదాన సౌదలో కూడా వర్షపునీరు నిండిపోయింది. ఇటు వర్షాలు, వరదల గురించి మంత్రి కేటీఆర్ కామెంట్స్ చేశారు. దీనికి అంతటికీ కారణం.. కేంద్ర ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఎయిర్ పోర్టులోకి వర్షపునీరు..
భారీ వర్షాలతో బెంగళూరు విమానాశ్రయంలోకి నీరు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పట్టణాలను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ ఆయన ట్వీట్లు చేశారు. నగరాలే దేశ, రాష్ట్రాల అభివృద్ధికి ప్రాథమిక వనరులు అని కేటీఆర్ పేర్కొన్నారు. నగరాభివృద్ధికి సరిపడ నిధులు కేటాయించి, ఖర్చు చేయకుంటే నగరాల్లో.. మౌలిక పరిస్థితులు దిగజారిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.హైదరాబాద్ సహా దేశంలో ఏ ఒక్క నగరానికి కూడా అప్పటికప్పుడు తలెత్తే వాతావరణ మార్పులను తట్టుకుని నిలబడగలిగే శక్తి లేదని తెలిపారు.
కేంద్రం కూడా బాధ్యత
మౌలిక వసతుల కల్పనకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా ఉమ్మడిగా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు. నగర పాలనలో వినూత్న పరిణామాలు అవసరం అని అభిప్రాయపడ్డారు.పరిశుభ్రమైన రోడ్లు, నీళ్లు, గాలితోపాటు వరద నీటి నియంత్రణలో మెరుగైన చర్యల రూపకల్పన పెద్ద కష్టమేమీ కాదని చెప్పుకొచ్చారు.
విదాన సౌధ వద్ద ఇలా
ఇందుకు మరింత మేర నిధులు కావాల్సి ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ దిశగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి దృష్టి సారించాలని కోరారు. దేశీయంగా అభివృద్ధి సాధించాలంటే సమైక్యంగా సాగే దిశగా ఆలోచన చేయాలని కోరారు. కేటీఆర్ ట్వీట్ చేయగా.. ఇటు మరో వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. అదీ విదాన సౌధకు సంబంధించినది.. అందులో వర్షపు నీరు స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు.. గల్లీలకే పరిమితం కాలేదు. విదాన సౌధకు కూడా వదలలేదు. 44 సెకన్ల వీడియోలో స్పష్టంగా కనిపించింది. అదీ క్యాంటిన్ మాదిరిగా ఉంది. అక్కడ వర్షపు నీరు నిలిచింది. దానిని స్పష్టంగా మనం చూడొచ్చు.












Click it and Unblock the Notifications