సాహితీవేత్త హత్య: సీబీఐ దర్యాప్తు (వీడియో)
బెంగళూరు: ప్రముఖ సాహితీవేత్త, హంపి విశ్వవిధ్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. హంతకులను వీలైనంత త్వరగా పట్టుకోవడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్ ఎం.ఎం. కలబుర్గి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని న్యాయ శాఖ మంత్రి టి.బి. జయచంద్ర చెప్పారు.

విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆదివారం ఇంటిలో ఉన్న కలబుర్గిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారని గుర్తు చేశారు. ఈ కేసు దర్యాప్తు ఇప్పటికే సీఐడికి అప్పగించామని మంత్రి జయచంద్ర అన్నారు.
కలబుర్గి కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీఐకి కర్ణాటక ప్రభుత్వం లేఖ వ్రాస్తుందని అన్నారు. సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టే వరకు సీఐడి అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తారని స్పష్టం చేశారు. హంతకులు ఎవరైనా సరే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి టి.బి. జయచంద్ర అన్నారు.
విద్యార్థుల ముసుగులో వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి కలబుర్గిని హత్య చేశారు. కలబుర్గి హత్య జరిగిన తరువాత వివాదస్పద వ్యాఖ్యలు చేస్తు ట్విట్ లు చేసిన యువకుడిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications